బిజెపి భయంతో దిగిరాక తప్పలేదు

  • సిఎం కెసిఆర్‌ ఓ ‌గ్రామానికి ఇన్‌ఛార్జ్‌గా రాకపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • టిఆర్‌ఎస్‌వి నీచ రాజకీయాలు…నడ్డాకు సమాధి కట్టడంపై బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ఆ‌గ్రహం

నల్లగొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్‌ ‌మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారాడని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ఆపేసి.. మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. వందల కోట్లు ఖర్చు పెట్టిన హుజురాబాద్‌, ‌దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ‌గెలవలేదన్నారు. మార్కెట్‌లో గొర్రెలను కొన్నట్టుగా టీఆర్‌ఎస్‌.. ఇతర పార్టీల నేతలను కొంటున్నారని కానీ మునుగోడు వోటర్లు అలా అమ్ముడుపోరని వ్యాఖ్యానించారు. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ ‌కుటుంబానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలుగా మారారని కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు.

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ ‌నిర్మూలన కోసం కేంద్రం 800 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అసైన్డ్, ‌బంజరు భూములు కనిపిస్తే టీఆర్‌ఎస్‌ ‌నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బతికున్న వారికి సమాధులు కట్టడం టీఆర్‌ఎస్‌ ‌దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్‌ఎస్‌ ‌బొంద పెట్టాలనుకుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం కాపాడిందన్నారు. అధికారులు టీఆర్‌ఎస్‌ ఒత్తిడికి తలొగ్గితే తిప్పలు తప్పవని కిషన్‌ ‌రెడ్డి హెచ్చరించారు. ఎనిమిదేళ్లుగా సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం.. కేసీఆర్‌ ‌మాత్రమేనని విమర్శించారు. రాష్టంలో జరిగే అన్ని అక్రమాలకు ప్రగతి భవన్‌ అడ్డాగా మారిందన్నారు. రాష్టంలో భూములను వదిలి పెట్టడంలేదని.. బీజేపీ వచ్చాక అవన్నీ కక్కిస్తామన్నారు. పార్టీ గెలుపుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టిఆర్‌ఎస్‌వి నీచ  రాజకీయాలు… నడ్డాకు సమాధి కట్టడంపై బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ఆ‌గ్రహం
టీఆర్‌ఎస్‌ ‌నీచ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌  ‌విమర్శలు గుప్పించారు. శుక్రవారం వి•డియాతో మాట్లాడుతూ… జేపీ నడ్డా కు సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. బతికి ఉండగా సమాధి కట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలిచారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హావి• అమలు కాలేదన్నారు. కేసీఆర్‌కు సమాధి కట్టి రాజకీయాలు చేయాలన్న కుసంస్కారం తమకు లేదని తెలిపారు. ట్విట్టర్‌ ‌టిల్లు దీనిపై ఎందుకు స్పందించడం లేదంటూ యెద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేల మొహాలపై ఊస్తున్నారన్నారు. ఉద్యమకారులంతా టీఆర్‌ఎస్‌ను వదిలేసి బీజేపీ లో చేరుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌తో ఉన్నది ఉద్యమద్రోహులు మాత్రమే అని తెలిపారు.

మునుగోడు ఉపఎన్నిక ఉద్యమకారులకు… ఉద్యమద్రోహులకు జరుగుతోన్న ఎన్నిక అని స్పష్టం చేశారు. జేపీ నడ్డా ఎపిసోడ్‌పై కేసీఆర్‌ ‌ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. సక్రమంగా పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో టీఆర్‌ఎస్‌ ‌సర్కారు ఉందని లక్ష్మణ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌మండలం దండుమల్కాపురం శివారు జాతీయ రహదారి పక్కన ప్లోరైడ్‌ ‌పరిశోధనా కేంద్రానికి కేటాయించిన స్థలంలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సమాధి కట్టారు. ఈ వ్యవహారంపై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page