- 12-14 ఏళ్ళ వయస్సు వారు, 60 ఏళ్ళ పైబడిన వారందరూ ఇప్పించుకోవాలి
- పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్
హైదరాబాద్, పిఐబి, మార్చి 16 : మన పౌరులకు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషిలో బుధవారం ఒక ముఖ్యమైన రోజుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 12 ఏళ్ళు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు వారు మరియు 60 ఏళ్ళ పైబడిన వారంతా టీకామందు ను ఇప్పించుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వయోవర్గాలకు చెందిన వారు అందరూ టీకామందును ఇప్పించుకోవాలంటూ లాయన విజ్ఞప్తి చేశారు. ‘‘యావత్తు భూ గ్రహం సంరక్షణకు సంబంధించి భారతదేశం యొక్క సభ్యతకు అనుగుణంగా మనం వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా అనేక దేశాలకు టీకా మందును పంపించాం. భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ ప్రయాసలు కోవిడ్-19 కి వ్యతిరేకంగా ప్రపంచం జరుపుతున్న యుద్ధాన్ని శక్తివంతంగా మార్చివేసినందుకు నేను సంతోషిస్తున్నాను.’’ అని తన ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.
ప్రస్తుతం, భారతదేశంలో ‘మేడ్ ఇన్ ఇండియా’ టీకాలు అనేకం ఉన్నాయని, సముచితమైనటువంటి మదింపు పక్రియను చేపట్టిన తరువాత ఇతర టీకామందులకు కూడాను ఆమోదాన్ని మంజూరు చేశామని, ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాడడంలో మనం ఎంతో మెరుగైనటువంటి స్థితిలో ఉన్నామని, అదే కాలంలో, కోవిడ్‌కు సంబంధించిన ముందు జాగ్రత చర్యలను అన్నిటిని మనం తప్పక అనుసరించాలని ప్రధాని పేర్కొన్నారు.