– ఐదురుగు వైమానికి సిబ్బంది మృతి
గౌహతి, జూన్ 13: అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం ఎయిర్‌బేస్ లోపల ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన కో-పైలట్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏఎన్-32 జెట్ దృఢమైన, రెండు ఇంజన్లు గల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని రూపొందించారు. ఇది ఎత్తైన ప్రదేశాలలోని ఎయిర్‌ఫీల్డ్‌లలో, వేడి ఉష్ణమండల వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. 7.5 టన్నుల సరకును, 50 మంది ప్రయాణికులను, 42 మంది పారాట్రూపర్‌లను రవాణా చేయగలదు. ప్రకృతి విపత్తుల సమయంలో మారుమూల ప్రాంతాలలో సామగ్రిని జారవిడవడానికి ఈ విమానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



