పల్లె ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు

పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు సౌకర్యాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి’’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండల పరిధిలోని సాయి రెడ్డి గూడ గ్రామంలో 70 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శ్రీకారం చుట్టిన పల్లె ప్రగతికి నేడు దేశ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు.జిల్లాకు ప్రతి నెల 9 కోట్ల8 లక్షల నిధులు విడుదల అవుతుండగా,ఇప్పటి వరకు 335 కోట్ల 32 లక్షల పల్లె ప్రగతి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.గ్రామాల్లో నేడు పల్లె ప్రగతి ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.నేడు దేశంలోనే మన గ్రామాలు టాప్‌ 20 ‌లో 19 నిలువటం గొప్ప విషయం అన్నారు.5 విడతలుగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి ఫలాలు నేడు ప్రజలకు చేరువయ్యాయని అన్నారు.స్వచ్ఛ గ్రామాలుగా తెలంగాణపల్లెలు మారాయన్నారు.పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, నర్సరీలు, ట్రాక్టర్లు,ట్యాంకర్లు,ట్రాలీ లు,తాజాగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్లస్టర్‌ ‌కు ఒక రైతు వేదిక,రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు లాంటి పథకాలు ఎంతగానో లబ్ది చెకురుస్తున్నాయన్నారు. తెలిపారు. ఫార్మా లో భూములు కోల్పోయిన రైతులకు ఇంటిస్థలాలు ఇస్తున్నట్లుతెలిపారు.

నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని అన్నారు.ఫార్మా రైతుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు.బడి బాటకు విశేష స్పందన.మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా 7300 కోట్లతో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.మండలం లో 3 కోట్లతో ప్రభుత్వపాఠశాలల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఫీజులుఉండవని,పుస్తకాలు,యూనిఫాం లు ఉచితంగా ఇస్తున్నామని,సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం అన్నారు.తరగతి గదులను అందంగా తీర్చిదిద్దుతునట్లు,నీటి సౌకర్యం కల్పిస్తున్నామని,మరుగుదొడ్లు, స్వచ్ఛత విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు మంత్రి అన్నారు.

సర్పంచ్‌ ‌లు చొరవ చూపాలని చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రయివేటు లో ఇంగ్లీష్‌ ‌మీడియం బోధన ఉన్నందునే చాలా మంది మొగ్గు చూపిస్తారని నేడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా1 నుండి 8 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడి బాట ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి నిష్ణాతులు అయిన ఉపాధ్యాయులు ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని మంత్రి సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బడి బాటకు విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి,వైస్‌ ఎం‌పీపీగంగుల శమంతా ప్రభాకర్‌ ‌రెడ్డి,చైర్మన్‌ ‌చంద్రశేఖర్‌,‌మాజీ చైర్మన్‌ ‌ప్రభాకర్‌ ‌రెడ్డి, దాసరపల్లి ఎం పి టి సి సర్పంచ్‌ ,‌టిఆర్‌ఎస్‌ ‌నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page