గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక!
పట్టణీకరణ వేగవంతమౌతున్న దృశ్యాన్ని ప్రభుత్వ నిర్వాహకుల ప్రగతిశీల స్వభావులు ప్రశంసా దృక్కులతో వీక్షిస్తూ ఉండడం వర్తమాన వాస్తవం. పల్లెటూళ్లు ప్రగతికి పట్టుకొమ్మలన్నది పాతబడిన సాంఘిక శాస్త్ర పాఠం. ఒకప్పుడు మూడు దశాబ్దాల క్రితం మనదేశపు జనాభాలో ఎనబయి శాతం పల్లెల్లో నివసిస్తున్నారని, అందువల్ల గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక అని నోరున్న…