నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ బట్టబయలు

మాకు ముందే అందిందన్న విద్యార్థి
•రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం
•పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్టయిన విద్యార్థి
•మరోమారు సుప్రీంలో విచారణ..అన్ని కేసులు సుప్రీంకు బదిలీ
•కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ

 

న్యూదిల్లీ,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ’నీట్‌- ‌యూజీ ప్రవేశపరీక్ష 2024 లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, పేపర్‌ ‌లీక్‌ ‌నిజమేనని తాజాగా బయటికొచ్చింది.

 

ముందురోజు రాత్రే నీట్‌ ‌ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. నీట్‌ ‌ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ ‌ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులోభాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ‌ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇం‌జినీర్‌తో పాటు ముగ్గురు నీట్‌ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరిలో ఓ అభ్యర్థి జూనియర్‌ ఇం‌జినీర్‌కు స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం. రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్న నాకు మామయ్య ఫోన్‌ ‌చేశారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, ఇంటికి రమ్మని పిలిచారు.

 

నీట్‌ ‌పరీక్ష మే 5 తేదీకి ఒక రోజు ముందు అంటే మే 4వ తేదీ రాత్రి నా స్నేహి తులను తీసు కుని నేను మామయ్య వద్దకు వెళ్లాను. అక్కడ నాకు నీట్‌ ‌ప్రశ్నపత్రం, ఆన్స ర్‌ ‌షీట్‌ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేం బట్టీపట్టాం. మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా మ్యాచ్‌ అయ్యింది‘ అని ఆ నీట్‌ అభ్యర్థి పోలీసులకు వెల్లడించాడు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు. దీంతో నీట్‌ అ‌క్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది.

 

మరోవైపు, నీట్‌ ‌పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్‌ ‌యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్‌ ‌కౌన్సెలింగ్‌ ‌పక్రియను ఆపేది లేదని న్యాయస్థానం పునరుద్ఘాటించింది.

నీట్‌ ‌పరీక్షలో జరిగిన అవకతవకలపై నివేదిక ఇవ్వాలని బిహార్‌ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ రాష్ట్రంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం కేంద్రం ఈ ఆదేశాలిచ్చింది. ప్రశ్న పత్రం లీకేజీతోపాటు మరిన్ని అక్రమాలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page