Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ యువతను కెసిఆర్‌ ‌కుటుంబం వంచన

కాంగ్రెస్‌ అం‌డగా నిలుస్తుంది
కేసులకు భయపడరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు
ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌
‌జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు

కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్‌ ‌కుటుంబం వంచిస్తుందని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఆదేశాలతో సోమవారం ఖమ్మం నడిబొడ్డున కాంగ్రెస్‌ ‌నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని తీసుకుని 50 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఖమ్మం జిల్లాగా సాక్షిగా అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు. మీ తరఫున న్యాయం జరిగే వరకూ కొట్లాడు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా నే ఊపిరి కోసిందన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు 1969 లో కొత్తగూడెం ధర్మల్‌ ‌ప్లాంట్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌కోసం 1300 ఎకరాల భూమిని సేకరించి ధర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌కట్టిన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక ఇతర ప్రాంతాల వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్న సందర్భంలో రాందాస్‌ అనే మా ఉద్యోగాలు మాకు కావాలంటూ మా తెలంగాణలో ఎవడు పెత్తనం ఏంటని ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి రవీంద్రనాథ్‌ అని గాంధీ చౌక్‌ ‌లో దీక్ష మొదలుపెట్టారు అని గుర్తు చేశారు. అప్పుడు రగిలిన నిప్పు 2009లో మళ్లీ దశ తొలి దశ ఉద్యమానికి పునాదులు వేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఖమ్మం జిల్లా ప్రజలు నిద్రపోలేదన్నారు కమ్యూనిస్టు సోదరులు విద్యార్థులు విద్యుత్‌ ‌స్తంభాలు పండించిన గిట్టుబాటు ధర కోసం ప్రజా హక్కుల కోసం కమ్యూనిస్టు ఉద్యమాలు పోరాటాలు ఉదృతంగా చేశారని చెప్పుకుంటున్న నేతలు నేడు జరుగుతున్న పరిణామాలను ఈ పోరాటం చేసామని గర్వంగా చెప్పుకునే నాయకులు, ప్రజలు ఆలోచించాలన్నారు.

PCC chief Revanth Reddy in Khammam unemployment protest meeting

నీళ్లు నిధులు నియమాకాలు అంటూ గద్దెనెక్కిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం వాటిని అమ్ముకుంటుందని చేశాడు. అమర వీరుల కుటుంబాలను నేటికి ఆదుకోలేదని, నిరుద్యోగ తరఫున కాంగ్రెస్‌ ‌పార్టీ విరామం లేకుండా పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడక అసెంబ్లీ సాక్షిగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రశ్నించగా ఏడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ‌నేటికీ అమలుకు చిత్తశుద్ధి చూపెట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వ విభాగాల్లో నేటికీ రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు సుముఖంగా లేదని విమర్శించారు. కేసీఆర్‌ ‌కుటుంబ పాలనే దీనికి కారణం అన్నారు. ఇంటికి ఉద్యోగం అన్నారు ఊరుకొక ఉద్యోగమైన ఇచ్చిండా అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడింది ఒక కేసీఆర్‌ ‌కుటుంబం అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ జంగ్‌ ‌సైరన్‌ ‌జంగ్‌ ‌సైరెంతో కాంగ్రెస్‌ ‌పోరాటం సాగిస్తుంటే గతంలో నోటిఫికేషన్‌ ‌వేశారని గుర్తు చేశారు. ముత్యాల సాగర్‌ అనే యువకుడు నోటిఫికేషన్‌ ‌రాకపోతే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ బలిదానాలతో రాష్ట్రం సాధిస్తే కుటుంబ పాలనతో తెలంగాణ యువతను అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  నేడు ప్రశ్నా పత్రాలు బజార్ల అమ్ముడు అవుతున్నాయని, ఇంత అసమర్ధ పాలన ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు.

30 లక్షల మంది నిరుద్యోగ యువత టిఎస్పిఎస్సి ఉద్యోగుల కోసం నమోదు చేసుకుంటే పరీక్షల ప్రశ్న పత్రాలు సంతలో జిరాక్స్ ‌సెంటర్లో అమ్ముడు అవుతున్నాయని ఆరోపించారు. ముందుగా రేణుక చౌదరి మాట్లాడుతూ… పిల్లలను కూలికి వెళ్లకుండా స్కూల్‌ ‌కి వెళ్లేలా చేసిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీ దని అన్నారు సాంకేతిక విద్యను అందించడంలో  రాజీవ్‌ ‌గాంధీ కృషి పరవాలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్‌రావు థాక్రే, వి హనుమంతరావు, బలరాం నాయక్‌ ‌సాంబార్‌ ‌చంద్రశేఖర రావు గడ్డం ప్రసాద్‌, ‌షబ్బీర్‌ అలీ, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌డిసిసి పోదాం వీరయ్య, మల్లు రవి, టిపిసిసి జనరల్‌ ‌సెక్రెటరీ ఎడవెల్లి కృష్ణ వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కోట్ల నాగేశ్వరరావు టి పి సి సభ్యులు నాగ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply