అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు 

– ‘ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో చర్యలు
– ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్

మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మండలంలోని గ్రామాల సమస్యలను అధికారులు ప్రజల సమక్షంలో తెలియజేసి తీర్మానం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేయడానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ రూపొందించడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. గురువారం కిన్నెర కళ్యాణ మండపంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి స్వర్ణలత లేనిన నాతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వినిపించిన అనంతరం మండల స్థాయి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో రహదారుల భద్రత అరైవ్ ఆ లైవ్, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, మహిళ సంఘాలు వంటి వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను అధికారులు సభలో తెలియజేశారు. అనంతరం సర్పంచులు తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పిఓ దృష్టికి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పి ఓ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రక్రియ వేగవంతమవుతోందన్నారు. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించడం, సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు విధులు సమర్థంగా నిర్వహిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నిర్దేశిత మెనూను కచ్చితంగా పాటించేలా పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యను మధ్యలో ఆపివేసిన (డ్రాస్అవుట్) విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్చే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని, వేసవి తీవ్రత దృష్ట్యా ప్రధాన కూడళ్లలో, కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *