నాన్న…ఆ పదంలోనే
ఆకాశమంత ప్రేమ,
అమృతసమానమైన మాధుర్యం.
బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా,
ఆ ఊపిరికి ఆలంబన నాన్న.
గురువుగా నడకలు నేర్పి,
గువ్వలా గుండెలో దాచుకొంటూ,
పిల్లల బతుకుల్లో
పున్నములు పూయించడానికి
రేపటి కలల స్వప్న ప్రమిదలో
తన చెమట చమురును పోసి
తానే వత్తిగా కాలుతూ
నిత్యం వెలుగులు పంచే
అఖండ జీవనజ్యోతి స్వరూపం,
నాన్న.
బిడ్డ నవ్వితే నవ్వడం,
ఏడిస్తే తన గుండెను
కోసివ్వడానికి కూడా వెనకాడని
నాన్నకన్నా…
త్యాగధనుడెవరు ఈలోకాన?
– వేమూరి శ్రీనివాస్, 9912128967, తాడేపల్లిగూడెం