తెలుగు రాష్ట్రాల్ల్లో రసవత్తర రాజకీయాలు!

‘‘ఏపీ  బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి తీసుకుని వొచ్చి ఉండేవారు. కానీ అల్లుడు చంద్రబాబును నమ్మిన ఎన్టీఆర్‌ ‌రాజకీయ కుట్రలకు బలయ్యారు. సొంత అల్లుడే కుట్రతో పదవీచ్యుతుడిని చేశారు. ఇప్పుడా పాపం పండిందా అన్నట్లుగా చంద్రబాబుకు కూడా జైలు జీవితం తప్పడం లేదు.’’

తెలుగు రాజకీయాలు రసవత్తరంగా సాగుతు న్నాయి. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పరస్పర విమర్శలు, ప్రచారాలతో హోరెత్తుతోంది. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్దం తీవ్రరూపం దాలుస్తోంది. రైతుబంధుపై ఇసికి కాంగ్రెస్‌ ‌ఫిర్యాదు..దానిపై మంత్రులు ఇతర నేతల విమర్శలతో మరింత వేడెక్కుతోంది. ఇక ఆంధ్రాలో ఎన్నికలకు ముందు వాతావరణం సాగు తోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఇక్కడా రణక్షేత్రం నడుస్తోంది. అన్నింటికి మించి దివంగత ఎన్టీఆర్‌ ‌తనయలు ఇద్దరూ ఎపి రాజకీయాల్లో తారాజువ్వల్లా దూసుకుని వొచ్చారు. ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురం ధేశ్వరి రాజకీయాలు చేస్తుంటే…నారా చంద్రబాబు నాయుడు జైలుకు పరిమితం కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి నేరుగా రాజకీయాల్లోకి దిగారు. నిజంగా తన కూతుళ్లు ఇంతగా రాజకీయ పరిణతి చెందినవారని ఆనాడు ఎన్టీఆర్‌ ఊహించి ఉండరు. అలా అనుకుని ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఆనాడే తెరపడేది. తనకూతుళ్లనే ఆయన రాజకీయాల్లోకి తీసుకుని వొచ్చి ఉండేవారు. కానీ అల్లుడు చంద్రబాబును నమ్మిన ఎన్టీఆర్‌ ‌రాజకీయ కుట్రలకు బలయ్యారు. సొంత అల్లుడే కుట్రతో పదవీచ్యుతుడిని చేశారు. ఇప్పుడా పాపం పండిందా అన్నట్లుగా చంద్రబాబుకు కూడా జైలు జీవితం తప్పడం లేదు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే తనకు రాజకీయభిక్ష పెట్టిన గురువు అద్వానీనే పక్కకు పెట్టిన ఘనుడు మన ప్రధాని మోదీ•. రాష్ట్రపతిగా అవకాశం వొచ్చినా ఇవ్వకుండా రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను తెరపైకి తెచ్చి అద్వానీకి దక్కాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేశారు. దేశ రాజకీయాల్లో ఇదో చారిత్రక తప్పిదంగా, మాయని మచ్చగా నిలిచిపోనుంది. ఇకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ల్లో రాజకీయం రంజుగా సాగుతోంది. జగన్‌ను ఎదుర్కొనే క్రమంలో ఎన్టీఆర్‌ ‌కూతుళ్లు పోటీపడి విమర్శలకు  దిగుతున్నారు. ఎపిలో మద్యం దుకాణాలు, బ్రీవరీజెస్‌పైనా, ఆర్థిక సమస్యలపైనా పురంధేశ్వరి ఆరోపణలు సంధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే మద్యంలో భారీ స్కామ్‌కు పాల్పడుతోందని ఆమె ఆరోపణలు సంధించారు. కేంద్రానికి ఫిర్యాదు చేశారు. నాసిరకం మద్యం తయారీ నుంచి సరఫరా వరకూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్‌ ‌రెడ్డి కుంభకోణానికి పాల్పడు తున్నారని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పురందేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. మద్యం తయారీ డిస్టిలరీలను బలవంతంగా లాక్కున్న వైసీపీ నాయకులు అందులో నాసిరకం మద్యాన్ని పిచ్చి బ్రాండ్లతో తయారు చేసి ప్రజల్ని దోచుకొంటున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

తాము అధికారంలోకి వొస్తే మద్య నిషేధం విధిస్తామని, మద్యం తయారు చేసినా, విక్రయించినా ఏడేళ్లు జైలుకు పంపుతామని మాటిచ్చిన జగన్‌ ‌తన వారితోనే మద్యం తయారు చేయిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇక చంద్రబాబు స్కిల్‌ ‌కేసులో జైలుకు వెళ్లడంతో నారా భువనేశ్వరి కూడా రాజకీయ రంగంలోకి దిగారు. నిజం గెలవాలి కార్యక్రమంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌లోని పౌరుషం, చంద్రబాబులోని క్రమశిక్షణె మన పోరాట ఆయుధాలని, వీటి ద్వారానే వైసీపీ అరాచక ప్రభుత్వం నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని భువనేశ్వరి పిలుపిచ్చారు.

నిజం గెలవాలి అంటూ కార్యక్రమంతో ఆమె మహాత్మాగాంధీ స్ఫూర్తితో పోరాటం చేస్తున్నామని.. ఆయన బ్రిటిషర్లపై పోరాటం చేస్తే, మనం స్వేచ్ఛ కోసం ఈ ప్రభుత్వం పై పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. అందరం కలిసికట్టుగా నందమూరి పౌరుషం, చంద్రబాబు క్రమశిక్షణ తో స్వాతంత్యం కోసం పోరాడదాం’ అని తెలిపారు.  చంద్రబాబును ఎన్నిరకాలుగా ఇబ్బందిపెట్టాలని చూసినా అదరడు. బెదరడని స్పష్టం చేశారు. తమ ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులైపోయామని.. ఆవేదన చెందారు. ఇక వైసిపి కూడా సామాజిక యాత్ర పేరుతో యాత్రలకు బయలుదేరింది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సిఎం జగన్‌ ‌పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిఎం జగన్‌ ‌కూడా ఓ వైపు తాను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. మరోవైపు చంద్రబాబు అవినీతి పాలన పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. అక్రమంగా పోగేసుకున్నారని వెళ్లిన ప్రతిచోటా ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజికయాత్ర పేరుతో జిల్లాల్లో యాత్రలకు వైసిపి శ్రీకారం చుట్టింది.

ఏపీలో పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్‌ ‌దేనని వైసీపీ నేతలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో వొ•చ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ ’సామాజిక సాధికార యాత్ర’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభంమైంది. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజక వర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తంగా ఎపి రాజకీయాలు ఇలా సాగుతున్నాయి. ఇక ఎన్నికల వేళ తెలంగాణలో రైతుబంధుపై రచ్చ మొదలయ్యింది. ఎన్నికల సమయం లో దీనిపై నిషేధం విధించాలని కాంగ్రెస్‌ ఇసికి చేసిన ఫిర్యాదుతో రచ్చ మొదలయ్యింది. కాంగ్రెస్‌ ‌రైతు వ్యతిరేక విధానాలకు ఈ ఫిర్యాదు ప్రబల నిదర్శనమంటూ బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఎదురుదాడికి దిగడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు బిజెపి నుంచి నేతలు ఒక్కొక్కరే బయటకు జారుకుంటున్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డి కూడా పార్టీని వీడడంతో పార్టీ భవిష్యత్‌పై అనుమానాలు బయటుదేరాయి. మరోవైపు జనసేనతో బిజెపి కలసి పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎపిలో టిడిపితో జనసేన పొత్తులు కుదుర్చుకున్నది. మొత్తంగా రాజకీయాల్లో పడి ప్రజల సమస్యలు వెనక్కి పోయినట్లే. అందరి లక్ష్యం ఎన్నికల్లో గెలవడం..అధికారం పొందడమే అన్నది జగమెరిగిన సత్యం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి విజ్ఞత ప్రదర్శిస్తారన్నది చూడాలి. అవే పార్టీలు..అవే సమస్యలు.. అయినా వోటర్లు తమ విజ్ఞతతో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిందే.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page