“టీడీపీతో కలిసి చంద్రబాబు, లోకేశ్‌ను ఎవరిని ముందు పెట్టి రాజకీయాలు చేసిన నష్టం తప్పదని మోదీ షాలు భావిస్తున్నట్లుంది. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు జగన్ దీర్థకాలిక మిత్రుడన్న బీజేపీ వ్యూహమే తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలకు కారణం.తెలంగాణలో జనసేన టీడీపీతో పాటు వైసీపీ వోటు బ్యాంక్ కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఒంటరి పోటీ అనేది కాషాయ పార్టీ వ్యూహమై ఉంటుంది.తెలంగాణలో పవన్ కల్యాణ్ అసందర్భంగా ఎంట్రీ చేయించి బీజేపీ వ్యూహత్మకంగా తప్పు చేసి చేతులు కాల్చుకుందన్న అభిప్రాయం కమలం నేతల్లో వ్యక్తమైతోంది..”
తెలంగాణలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. రెండేళ్ల ముందు నుంచే రాష్ట్రంలో రాజకీయ సమీకరణలను మార్చేలా వ్యూహాలు అమలు చేస్తుంది. ఏపీ సహా దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమిగా పోటీ చేసిన కమలం పార్టీ తెలంగాణలో మాత్రం ఒంటరి పోరే అంటూ అమిత్ షా వంటి నేతలు ప్రకటనలు ఇస్తున్నారు. అటు ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తుందంటున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఒంటిరిగా పోటీ చేయడం అనేది ఒక ప్రకటన మాత్రమే.కమలం పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయదు.అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చీల్చడం, లోకల్ పార్టీలో నెంబర్ టు స్థానంలో ఉన్న నేతలను తన వైపు తిప్పుకోవడం, ఎన్నికలు నాటికి బీజేపీలో చేర్చుకోవడం చేస్తుంది.మొదట్లో ప్రాంతీయ పార్టీతో జూనియర్ తోక పార్టీగా చేరి ఆనకొండలా ప్రాంతీయ పార్టీని క్రమంగా మింగేయడం, అందులో ఉన్న కీలక నేతలను బీజేపీలో విలీనం చేసుకుని అధికారంలోకి రావడం మోదీ షాల పొలిటికల్ వ్యూహం. పార్టీలను చీల్చడం, కుల మత రాజకీయాలు, విచారణ సంస్థలతో ముసుగులో కీలక నేతలను చేర్చుకోడం బీజేపీ త్రిముఖ వ్యూహం.
ఎన్ని సార్లు ప్రయత్నించిన తెలంగాణలో బీజేపీ వ్యూహలు పారడంలేదు. అయితే బెంగాల్‌లో గెలుపు తర్వాత తెలంగాణలో కూడా గెలుస్తామన్న ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. తెలంగాణలో పాగా కోసం బీజేపీ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. బెంగాల్ ఫలితాలు రాగనే కాషాయ పార్టీ తన మొత్తం ఫోకస్‌ను, పూర్తి శక్తి సామార్థ్యాలను తెలంగాణపై కేంద్రీకరించింది. ఎలాగు తెలంగాణలో అధికార కాంగ్రెస్‌లోని కీలక నేతలు బీజేపీకి సహకరిస్తుండటం, అవసరమైతే కమలం గూటికి చేరేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు.దీంతో తెలంగాణలో తాము అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకే అన్న విశ్వాసంలో పువ్వు పార్టీ నేతలున్నారు.అది విశ్వాసమా అతి విశ్వాసమో ఎన్నికల తర్వాత గాని తెలియదు. ఆర్ఎస్‌ఎస్ అనుబంధ సంఘాలను, బీజేపీ అనుబంధ కమిటీలను యాక్టివ్ మోడ్‌లోకి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ నుంచి రాజ్‌నాథ్ సింగ్ వరకూ కషాయ పెద్దలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. రెండేళ్ల ముందే బెంగాల్‌లో మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టితే అమిత్ షా, నడ్డా రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు పోలింగ్ తేదీనాటికి ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకువెళ్లారు..కులం మతం, ఎస్‌ఐఆర్, ఈడీ,సీబీఐ, ఐటీ వంటి త్రిముఖ వ్యూహలతో వోటర్ల పోలరైజ్ చేసి వన్ సైడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో మోదీ పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.రెండేళ్ల ముందు నుంచే కమలం పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. తన ఎన్డీయే మిత్రపక్షాలను యాక్టీవ్ చేసింది. ఇందులో భాగంగానే హైద్రాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కలిసి మోదీ మిత్ర పక్షాలను,వారి క్యాడర్‌ను యాక్టీవ్ చేశారు.
“ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక వోట్లే కాదు, బీజేపీ, టీడీపీ వోట్ షేర్‌తో పాటు కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేక వోట్ షేర్ కూడా వన్ సైడ్‌గా బీఆర్ఎస్‌కు కన్సాలిడేట్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక వోటు బీఆర్ఎస్‌కు మళ్లకుండా వ్యూహలు అమలు చేస్తుంది. అంతేకాదు తమ వోట్ బ్యాంక్‌ను కాపాడుకునేందుకు, వోటు బ్యాంకును స్థిరపరచుకునేందుకు, కాంగ్రెస్ యాంటీ గవర్నమెంట్ వోట్ బ్యాంక్, రేవంత్ వ్యతిరేక వోట్ షేర్ ఎన్నికల వరకు బీఆర్ఎస్‌కు వెళ్లకుండా బీజేపీ, జనసేన, కవిత మధ్య చీలిపోయాలా మోదీ షా ప్లాన్ చేస్తారు ఇందులో భాగంగానే తెలంగాణలో ఒంటరి పోరు అంటూ ఆయా కూటమి మిత్ర పక్షాలు ప్రకటిస్తున్నాయి.”
మోదీ పర్యటన తర్వాత హైద్రాబాద్ కేంద్రంగా పొలిటికల్ దంగల్ మొదలైంది.పవన్ తెలంగాణలో పార్టీని విస్తరిస్తానని ప్రకటించడం, మహానాడులో లోకేశ్ తెలంగాణలో టీడీపీని మళ్లీ విస్తరిస్తానని చెప్పడం అన్ని చకచక జరిగిపోతున్నాయి.అయితే తెలంగాణలో పవన్ ముందు పెట్టి బీజేపీ తెర వెనుక వ్యూహలు రచిస్తుంది. చంద్రబాబు, టీడీపీ కంటే తెలంగాణలో పవన్ మాత్రమే నమ్మిన బంటుగా బీజేపీ భావిస్తుంది.
టీడీపీతో కలిసి చంద్రబాబు, లోకేశ్‌ను ఎవరిని ముందు పెట్టి రాజకీయాలు చేసిన నష్టం తప్పదని మోదీ షాలు భావిస్తున్నట్లుంది. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు జగన్ దీర్థకాలిక మిత్రుడన్న బీజేపీ వ్యూహమే తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలకు కారణం.తెలంగాణలో జనసేన టీడీపీతో పాటు వైసీపీ వోటు బ్యాంక్ కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఒంటరి పోటీ అనేది కాషాయ పార్టీ వ్యూహమై ఉంటుంది.తెలంగాణలో పవన్ కల్యాణ్ అసందర్భంగా ఎంట్రీ చేయించి బీజేపీ వ్యూహత్మకంగా తప్పు చేసి చేతులు కాల్చుకుందన్న అభిప్రాయం కమలం నేతల్లో వ్యక్తమైతోంది.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు తెలంగాణలో బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. బీజేపీ ఎప్పుడైనా త్రిముఖ వ్యూహలతో ప్లాన్ బీ కూడా అమలు చేస్తుంది.ఇప్పుడు తెలంగాణలో ఎన్డీయే కూటమిగా పోటీ చేయాలనుకుని పవన్‌తో ప్రయోగం చేసి విఫలమైంది. తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన ధిక్కారస్వరం రావడంతో మోదీ షా ప్లాన్ బీ మొదలుపెట్టింది.
తెలంగాణలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తే నష్టం జరుగుతుందని గ్రహించిన మోషాలు ప్లాన్ బీ తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అమిత్ షా ప్రకటించారు. అంతకుముందు పవన్ కల్యాన్ కూడా ఒంటరిగానే పోటీ చేస్తామంటూ చెప్పారు. బీజేపీ, టీడీపీలు కలిసి వస్తాయా రావా అన్నది తర్వాత సంగతి కానీ ఇప్పటికైతే ఒంటరిగానే పోటీ అంటూ జూన్ 2న తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజు పవన్ ప్రకటించారు. తెలంగాణలో ఒంటరి పోటీ ఎన్డీయే కూటమితో కలిసి పోటీనా అన్నది టీడీపీ ప్రకటించలేదు..ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ కూడా ఎన్డీయే కూటమిలో కలిసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపలేదు.
అయితే బీజేపీ, జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది.బీజేపీ, జనసేన తమ వోట్ బ్యాంక్‌ను కాపాడుకునే ఎత్తుగడ ఉంది..జనసేనకు వోట్ బ్యాంక్ పెద్దగా లేకున్న బీజేపీకి పటిష్టమైన వోట్ బ్యాంక్ ఉంది.అదే సమయంలో టీడీపీ వోట్ బ్యాంక్ ప్రస్తుతం రేవంత్ రెడ్డితో ఉన్న అది చీలిపోకుండా కన్సాలిడేట్‌గా ఉంచేందుకు బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఒంటరి పోటీ.
మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక వోటు షేర్‌ను చీల్చే కుట్రలు బీజేపీ చేస్తుంది..రాష్ట్రంలో బీజేపీ ఫర్మామెన్స్ పూర్‌గా ఉంది..అందుకే పవన్‌ను రంగంలో దింపిన ప్రయోజనం కనిపించడం లేదు..దీంతో ఒక లాభం లేదని వోట్ షేర్‌ను కాపాడుకునేందుకు ఒంటరి ఎజెండాను అనుహ్యంగా అమిత్ షా తెర పైకి తీసుకువచ్చారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండున్నేళ్లు సమయం ఉంది.ఇప్పుడు పోటీపై ప్రకటించాల్సిన అవసరమే లేదు. కానీ తమ వోట్ బ్యాంక్‌కును కాపాడుకునేందుకు, పార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు మైగ్రేట్ కాకుండా,తమ పార్టీ ఇతర కూటమిగా పోటీ చేస్తే తమకు అవకాశాలు వస్తాయో రావో అని ప్రధమ, ద్వీతీయ శ్రేణి నాయకులు రాజకీయ అవసరాల కోసం ఇతర పార్టీలకు వెళ్లకుండా నిలువరించేందుకు బీజేపీ ఒంటరి పోటీ అంశాన్ని ఎత్తుకుంది.
తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలనపై జనాలు ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలపడుతుంది. పవర్ లో లేకున్న క్యాడర్ యాక్టీవ్‌గా ఉన్నారు.కేటీఆర్‌పై, హరీష్ రావుపై రేవంత్, బీజేపీ ఎన్ని డైవర్షన్ విమర్శలు చేస్తున్నా, ప్రభుత్వ వ్యతిరేక వోట్ బ్యాంక్ బీఆర్ఎస్ తన వైపు తిప్పుకుంటూ కన్సాలిడేట్ చేస్తున్నారు. మరోవైపు ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక వోట్లే కాదు, బీజేపీ, టీడీపీ వోట్ షేర్‌తో పాటు కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేక వోట్ షేర్ కూడా వన్ సైడ్‌గా బీఆర్ఎస్‌కు కన్సాలిడేట్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక వోటు బీఆర్ఎస్‌కు మళ్లకుండా వ్యూహలు అమలు చేస్తుంది. అంతేకాదు తమ వోట్ బ్యాంక్‌ను కాపాడుకునేందుకు, వోటు బ్యాంకును స్థిరపరచుకునేందుకు, కాంగ్రెస్ యాంటీ గవర్నమెంట్ వోట్ బ్యాంక్, రేవంత్ వ్యతిరేక వోట్ షేర్ ఎన్నికల వరకు బీఆర్ఎస్‌కు వెళ్లకుండా బీజేపీ, జనసేన, కవిత మధ్య చీలిపోయాలా మోదీ షా ప్లాన్ చేస్తారు ఇందులో భాగంగానే తెలంగాణలో ఒంటరి పోరు అంటూ ఆయా కూటమి మిత్ర పక్షాలు ప్రకటిస్తున్నాయి.
కాంగ్రెస్ వ్యతిరేక వోట్ షేర్ బీఆర్ఎస్ వైపు కన్సాలిడేట్ కాకుండా వెంటనే ఒంటరి పోటీ అంటూ పవన్, ప్రకటనలు చేశారు. ఏపీలో కూడా ఇలాంటి వ్యూహమే బీజేపీ పవన్ అమలు చేశారు. మొదటి నుంచి ఒంటిరిగానే పోటీ అంటూ పవన్, చంద్రబాబు, బీజేపీ ప్రకటనలు చేశారు. చంద్రబాబు పవన్ తమ వోట్ బ్యాంక్‌ను కాపాడుకుంటేనే ప్రభుత్వ వ్యతిరేక వోట్ చీలకుండా చేశారు. ఫస్ట్ నుంచే ఎన్డీయే కూటమిలో పవన్, చంద్రబాబు చేరి కూటమిగా పోటీ చేస్తామని ప్రకటిస్తే ప్రభుత్వ వ్యతిరేక వోట్ షేర్ కూటమి వైపు మళ్లకపోయి ఉండేది .అందుకే ఒంటరి పోటీ అంటూనే చివరి ఆరు నెలల్లోనే పొత్తుల కూటమి చేశారు.మూడు పార్టీల వోట్ షేర్ కన్సాలిడేట్ చేసిన మోషాలు. వైపీసీ వ్యతిరేక వోట్ షేర్ కూటమికి మళ్లించారు. అందుకే ఏపీలో కూటమికి వన్‌సైడ్ విక్టరీ లభించింది.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు, టీడీపీ, బీజేపీకి స్థిరమైన వోట్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది..ప్రజల్లో ఉన్న ఆ వ్యతిరేకత బీఆర్ఎస్‌కు వోట్ బ్యాంక్‌గా మారకుండా, కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వోట్ షేర్ బీఆర్ఎస్‌కు మళ్లకుండా జనసేనకు మళ్లించే ఒక ప్రయత్నం బీజేపీ చేసింది.రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో కూటమి ఎదుగుదలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వైఫల్యాలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను బీజేపీ నేతలు ముక్తకంఠంతో సమర్థించడం, కాంగ్రెస్ ను విమర్శిస్తు రేవంత్ రెడ్డిని పొగడటంలో రేవంత్ బీజేపీ ఒక్కటే అన్న చర్చకు బలం చేకూరుతుంది.మూసీ నుంచి బండి భగీరథ్ ఇష్యూ తాజాగా మీనాక్షి నటరాజన్ ఇష్యూ వరకూ తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక స్థానంలో బీజేపీ కోవర్ట్‌లు ఉన్నారన్న చర్చకు మరింత బలపడుతుంది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వోట్ షేర్ బీజేపీకి మళ్లించేందుకు రేవంత్ ప్రయత్నం చేశార్న విమర్శలున్నాయి. 8 మంది బీజేపీ ఎంపీల గెలుపులో రేవంత్ పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి.అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌ను మెయిన్ స్ట్రేమ్ లేకుండా చేసి బీజేపీ మెయిన్ స్ట్రీమ్‌కు ఉంచేలా ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్‌ను బలహీనపర్చుతూ బీజేపీ బలపడేలా కుట్రలు చేశారన్న విమర్శలున్నాయి. అయితే రేవంత్ వ్యూహాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టుతూనే ఉంది.రేవంత్ బీజేపీ ఎజెంట్ అంటూ బడేబాయ్ చోటే బాయ్ రహస్యాన్ని భట్టభయలు చేస్తుంది. రేవంత్, బీజేపీ ఒక్కటే అంటూ సందర్భానుసారంగా ఎక్స్‌పోజ్ చేస్తోంది.
బీజేపీలో తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నేతలను రేవంత్ బండి టార్గెట్ చేస్తున్నారు. బండి భగీరథ్ విషయంలో భారీగా నష్టపోయిన బీజేపీ, పవన్ కామెంట్స్‌తో మరింత నష్టపోయింది. దీంతో బీజేపీ ,పవన్ ఒంటరి పోటీ వ్యూహలు అమలు చేస్తుంది. ఏపీ కాంగ్రెస్‌ను సమాధి చేసినట్లే తెలంగాణలో కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ వోట్ షేర్‌ను ఒంటరి పోటీ పేరుతో పంచుకునే పని కూటమి పార్టీలు ఉన్నాయి. ఒకవైపు కుల, మత రాజకీయాలతో వోట్ల కాన్సాలిటేషన్ చేసే ప్రయత్నం చేస్తు మరోవైపు ఒంటరి పోటీ అంటూ వ్యూహాలకు పదునుపెట్టుతుంది. ఇంకోవైపు కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. రేవంత్ రెడ్డి మరో సుదేంద్, హేమంత బిశ్వ శర్మ కావచ్చంటూ బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. రేవంత్, బీజేపీ రహస్య బంధం, కాంగ్రెస్ కమ్ ప్రభుత్వ వోట్ షేర్ బీజేపీకి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది.
అటు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ ఒంటరిగానే పోటీ అంటున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగా పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం జరుగుతుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది..రాష్ట్రంలో ఎన్డీయే కూటమిగా పోటీ చేసిన, మిత్రపక్షాలన్నీ విడివిడా పోటీ చేసిన మొదటి నష్టం మాత్రం కాంగ్రెస్సేకే జరుగుతుంది..తెలంగాణలో కూటమి మిత్ర పక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు లాభం చేస్తుంది, 90 శాతం గెలుపు అవకాశాలున్నాయి. స్థిమైన వోట్ బ్యాంక్ ఉన్న బీఆర్ఎస్ కు లాభం జరుగుతుంది. బీజేపీ గతం కంటే బలపడుతుంది. టీడీపీ వోట్ షేర్ బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీలుతుంది. జనసేన వోట్ షేర్ వన్ టు పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది.
తెలంగాణలో బీజేపీ, పవన్ ఒంటరి పోటీ వ్యూహం ఏంటీ.?.అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయా వర్గాల్లో జరుగుతుంది. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డబుల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితిలో లేదు..అయితే బీఆర్ఎస్ కు ప్రభుత్వం వ్యతిరేక వోట్ షేర్ కన్సాలిడేట్ కాకుండా,టీడీపీ వోట్ బ్యాంక్‌ను బీఆర్ఎస్‌కు దూరం చేసి పవన్‌కు మళ్లించడమే కాకుండా కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అనుకూల వోట్ షేర్ ఉన్న పళంగా బీజేపీ వైపు మళ్లించడానికే ఒంటరిపోటీ డ్రామా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అంతేకాదు, పోస్ట్ పోల్ అలయాన్స్ కోసం ముందుస్తు కర్చిఫ్ అన్న చర్చ కూడా ఉంది. అయితే పరోక్షంగా బీఆర్ఎస్ తో, కుదిరితే రేవంత్ తో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్లానా అన్న విశ్లేషణలు కూడా వినినిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి ఖరాకండిగా చెపుతుంది..వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే గులాబీ పార్టీ పోటీ చేస్తుందని, ఏ జాతీయ పార్టీలతో పొత్తులండవని చేపుతూనే ఉంది.
మరోవైపు బీజేపీ, పవన్ ఒంటరి పోటీ ప్రకటనలపై ఇంకో చర్చ కూడ ఉంది.పక్క రాష్ట్రం ఏపీలో బీజేపీ జనసేన, టీడీపీలు కూటమిగా ఏర్పాడి ఎన్డీయేలో ఉంటూ పోటీ చేసి తెలంగాణలో ఒంటరి పోటీ సాధ్యమా.?.అన్న డౌట్స్‌పెరుగుతున్నాయి..అంతేకాదు గతంలో ఏపీలో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయి నష్ట పోయామన్న పవన్ కల్యాణ్ తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు.బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ఎన్డీయే మిత్రపక్షాలతో కేంద్రంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే చాన్స్ వంద శాతం లేదు.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక వోట్ షేర్ చీల్చడం, ఎన్నికలనాటికి ఒంటరి పోటీ పేరుతో వోట్ బ్యాంక్‌ను పంచుకోవడం..వన్ సైడ్‌గా యాంటీ గవర్నమెంట్ వోట్లు గంపగుత్తగా బీఆర్ఎస్‌కు మళ్లకుండా బీజేపీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాను రక్తికట్టించేందుకు సింగిల్‌గా పోటీ ప్రకటనలు.ఎన్నికలు చివరి ఆరు నెలల్లో రేవంత్, బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ కలిసి కూటమిగా పోటీ చేస్తాయి.కళ్ల ముందే ఏపీలాంటి ఉదాహరణలున్న తెలంగాణలో ఒంటరి పోటీ అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమయాకులు కాదు.బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు రేవంత్ బీజేపీ ఆడుతున్న క్రైమ్ త్రిల్లర్ ఒంటరి పోటీ కథా చిత్రం..
– తోటకూర రమేష్





