తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం
అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి
తెలంగాణలో కాంగ్రెస్‌ ‌హావి•లను అమలు చేస్తాం
కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వొచ్చి చూడండి
అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ ‌రాజ్యం ఏలుతున్నారు
మోదీ ఎన్నిసార్లు వొచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ‌ఖతం
కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ ‌సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య

కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం..కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం..అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి..తెలంగాణలో కాంగ్రెస్‌ ‌హావి•లను అమలు చేస్తాం..కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వొచ్చి చూడండి..అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ ‌రాజ్యం ఏలుతున్నారు..మోదీ ఎన్నిసార్లు వచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ‌ఖతం.. అని శుక్రవారం కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ ‌సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కామారెడ్డి వేదికగా కాంగ్రెస్‌ ‌పార్టీ కీలకమైన వ్యూహాలను అమలు చేస్తుంది. కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ ‌వేయగా, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్‌ ‌బీసీ డిక్లరేషన్‌ ‌ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లోనే తమ ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేస్తామని సిద్ధరామయ్య హావి• ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలని కేసీఆర్‌కు చెప్పారు.
కేసీఆర్‌ ‌కర్ణాటకకు వొస్తే దగ్గరుండి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీమ్‌లను పక్కాగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీకి తేడా ఏవి• లేదని, బీఆర్‌ఎస్‌.. ‌బీజేపీ బీ టీమ్‌ అని ఆరోపించారు. తెలంగాణకు మోదీ 100 సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 సభలు పెట్టారని, రోడ్‌ ‌షోల్లో విపరీతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రధాని మోదీ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్‌ ‌పార్టీనే గెలిచిందని అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదని అన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీసీల వెనుకబాటు తనానికి ప్రధాని మోదీనే కారణమని అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని సిద్ధరామయ్య విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కామారెడ్డిలో రేవంత్‌ ‌రెడ్డి చిత్తుగా ఓడిస్తారని సిద్ధరామయ్య అన్నారు. కామారెడ్డితో పాటు, గజ్వేల్‌లో కూడా సీఎం కేసీఆర్‌ ఓడిపోతారని అన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, ‌బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని అన్నారు. రేవంత్‌ ‌రెడ్డి కామారెడ్డితో పోటు కొడంగల్‌ ‌కూడా రెండు చోట్ల గెలుస్తారని అన్నారు.
బీసీల 34 రిజర్వేషన్లు 25 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌ ‌కే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌ అవినీతి డబ్బును ఖర్చు చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపు ఇచ్చారు. అవినీతి సొమ్ముతో వోట్లను కొనేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనైపోయిందని సిద్ధరామయ్య అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి నాలుగైదు సీట్లు వస్తే అవే చాలా ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ వంద సార్లు వచ్చి ప్రచారం చేసినా బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. మోడీ ఎక్కడ ప్రచారం చేశారో అక్కడే కాంగ్రెస్‌ ఎక్కువ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. మోడీని నమ్ముకున్న కర్నాటక బిజెపి నేతలు ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారని తెలిపారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు.. కామారెడ్డిలో కాంగ్రెస్‌ ‌పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్‌ ‌సభ నిర్వహించింది. బిసి డిక్లరేషన్‌ ‌సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్‌, ‌సిపిఐ నేత నారాయణ, చాడ వెంకట్‌ ‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల, బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేవంత్‌ ‌రెడ్డి సిఎం కెసిఆర్‌ ‌పై పోటీ చేస్తున్నారు. రేవంత్‌ ‌రెడ్డి మరో చోట కూడా పోటీ చేస్తున్నారు. సిఎం కెసిఆర్‌ ‌కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారని వెల్లడించారు. రెండు చోట్లా రేవంత్‌ ‌రెడ్డి, కెసిఆర్‌ ‌పై భారీ మెజారిటీతో రేవంత్‌ ‌రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మళ్లీ అధికారంలోకి వొచ్చేందుకు కెసిఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ ‌పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని సిద్ధరామయ్య ఆరోపించారు. కెసిఆర్‌ ‌ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఓటుతో కెసిఆర్‌ ‌ను ఇంటికి పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page