- రాష్ట్రాన్ని అప్పులకుప్పగగా మార్చారు
- ఇచ్చిన హాలు నిలబెట్టుకోవడంలో విఫలం
- త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ ఆరోపణ
ఆదిలాబాద్, జూన్ 30 : తెలంగాణ రాష్టాన్న్రి కేసీఆర్ తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ ఆరోపించారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్టాన్న్రి అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హాని కేసీఆర్ నిలబెట్టుకోలేదని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్న ఆయన… బీజేపీ అంటే కేసీఆర్ కు వణుకు పుడుతోందని తెలిపారు. బీజేపీ జాతీయ సమావేశాలను నీరు గార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తూ హైదరాబాద్ లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు.
ప్రధాని మోడీకి అన్ని రాష్టాల్రు సమానమేనని, కరోనా సమయంలో రాజకీయాలతీతంగా అన్ని రాష్టాల్రను ఆదుకున్న గొప్ప వ్యక్తి మోడీ అని కొనియాడారు. ఆనాడు వాజ్ పాయ్, ఇవాళ మోడీ… రాష్ట్ర నీటి పారుదల పథకాలకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ పై పెట్టుకున్న ఆశలు అడియశలయ్యాయని, టీఆర్‌ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీ అని స్పష్టం చేశారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు.