అధిక సంఖ్యాక వోట్లు టార్గెట్ – దూకుడు పెంచిన కమల నాధులు
భారతీయ జనతా పార్టి దక్షిణాది లో కర్నాటక తర్వాత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన దృష్టిని కేంద్రీక రించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కన్నా తెలంగాణ లో బిజెపీకి మంచి ఆదరణ ఉందని గట్టిగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చిన ఘాడంగా విశ్వసిస్తోంది. అందుకు తగ్గట్టు గానే బిజెపి పక్కా ప్రణాళికతో పావులు కదుపు తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి రెండు సార్లు అధికారం లోకి వచ్చి మూడో సారి కూడ తమదే అధికార మని నిరూపించుకునే యత్నంలో ఉంది. ఎదురు లేదనుకున్న టిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెడుతూ బిజెపి ఆనూహ్యంగా 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచినప్పటి నుండి దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ లో పరిస్థితులు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అధికార టిఆర్‌ఎస్ పార్టి పైనా ఆ పార్టి అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారంపైనా జనం అసంతృప్తితో ఉన్నారని బిజేపి వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏ అవకాశాన్ని వదలు కోవడం లేదు.
తెలంగాణ లో బిజేపీ అత్యధిక వోట్ల శాతం ఉన్న కులాలపై కన్నేసింది. బిసి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ ను రాజ్య సభ కు ఎంపిక చేసింది. అంతకు ముందు డా.లక్ష్మణ్ పార్టి అధ్యక్షులుగా కొనసాగగా అతన్ని ఓబిసి జాతీయ అధ్యక్షులుగా గా నియమించి ఆయన స్థానంలో అదే కుల సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు పార్టి అధ్యక్ష పీఠం అప్పగించింది. బండి సంజయ్ తన మాటలతో అధికార పార్టీపై విమర్శలు చేసే తీరుతో జనానికి బాగా కనెక్ట్ అయ్యారు. అట్లాగే నిజామాబాద్ ఎంపి అరవింద్ కూడ తన స్టైల్ లో సిఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించి తెలంగాణ జనాన్ని ఆకట్టు కున్నారు. ఈ బిజెపి ఎంపీలు తమ యాసతో తెలంగాణ జనాలకు బాగా దగ్గరయ్యారు. 2018 ఎన్నికల్లో బిజెపి కేవలం ఒకే ఒక్క అసెంబ్లి సీటు హైదరాబాద్ నగరంలో గెలుచు కోగా ప్రస్తుతం దుబ్బాక తో పాటు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి సంఖ్యను మూడుకు పెంచుకుంది. దుబ్బాకలో రఘునందన రావు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ హోరా హోరీ ఎన్నికల సంగ్రామంలో విజయం సాధించారు. హైదరాబాద్ జిహెచ్ ఎంసి ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి బిజెపి చుక్కలు చూపింది. టిఆర్‌ఎస్ పార్టీపై నగర ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బిజేపికి చాలా ఉపకరించింది.2019 ఎన్నికలు మొదలు దుబ్బాక, హుజూరాబాద్, ఉప ఎన్నికలు జిహెచ్ ఎంసి ఎన్నికలు పార్టీకి తెలంగాణ లో ఆశలు పెంచాయి.
ఈ కారణంగానే బిజెపి రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలన పైనా సిఎం కెసిఆర్ పైనా యుద్ధం ప్రకటించి అడుగడుగునా తూర్పార పడుతు జనాల మద్దతు విస్తృతం చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగానే పార్టి చీఫ్ బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్రల పేరిట యాత్రలు చేపట్టి మద్దతు కూడగట్టే యత్నంలో ఉన్నాడు.
మత విశ్వాసాలను ప్రధానాస్త్రంగా చేసుకుని మెజార్టీగా ఉన్న హిందూ వోటర్లను ఏకం చేయడమే లక్ష్యంగా బిజెపి నేతలు ఎంతటి వివాదాస్పదాలకైనా వెనుకాడడం లేదు. మందిర్- మజీద్ రాజకీయ ఎజెం డా గ్రామాలకు విస్తరింప చేసే పనిలో పడ్డారు. అందుకే కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దేశంలో తాజాగా చర్చనీయాంశ మైన జ్ఞానవాపి ఆలయం వివాదాన్ని గ్రామాల వరకు తీసుకురావాలని బిజెపి చూస్తోందని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్దం చేసుకోవచ్చు . ‘‘ తెలంగాణలోనున్న మసీదులను తవ్వి చూద్దాం.. శవాలొస్తే మీవి… శివం వస్తే మావి’. అందుకు మీరు సిద్ధమా?’ అంటూ ఎంఐఎం అధినేత ఓవైసీకి సవాల్ విసిరాడు.
మత విశ్వాసాలను ప్రధానాస్త్రంగా చేసుకుని మెజార్టీగా ఉన్న హిందూ వోటర్లను ఏకం చేయడమే లక్ష్యంగా బిజెపి నేతలు ఎంతటి వివాదాస్పదాలకైనా వెనుకాడడం లేదు. మందిర్- మజీద్ రాజకీయ ఎజెం డా గ్రామాలకు విస్తరింప చేసే పనిలో పడ్డారు. అందుకే కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దేశంలో తాజాగా చర్చనీయాంశ మైన జ్ఞానవాపి ఆలయం వివాదాన్ని గ్రామాల వరకు తీసుకురావాలని బిజెపి చూస్తోందని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్దం చేసుకోవచ్చు . ‘‘ తెలంగాణలోనున్న మసీదులను తవ్వి చూద్దాం.. శవాలొస్తే మీవి… శివం వస్తే మావి’. అందుకు మీరు సిద్ధమా?’ అంటూ ఎంఐఎం అధినేత ఓవైసీకి సవాల్ విసిరాడు.
బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని, మతమార్పిళ్లు చేస్తే మక్కెలిరగదీస్తా మని, లవ్ జిహాదీ అంటే లాఠీ రుచిచూపిస్తా మని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతే కాక కశ్మీర్ ఫైల్స్ తరహాలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోందని ఇక సిన్మాచూపిస్తామంటూ హెచ్చరిక చేసారు. ముస్లీం మత మైనార్టీల వోట్లు ఎప్పటికి తమ ఖాతాలోకి రావని తెల్సే బిజెపి వారికి వ్యతిరేకంగా గ్రామస్థాయి వరకు హిందు వోటర్లను ఏకం చేసే కార్యాచరణను అమలు చేస్తున్నదా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గణతంత్ర లౌకిక రాజ్యంలో వోట్ల కోసం ఇలాంటి మత రాజకీయాలు కొత్తేమి కాదు. రామజన్మభూమి – బాబ్రి మసీదు నుండి మొదలైన మందిర్ – మసీదు రాజకీయాలు దేశంలో గల్లి గల్లీకి తీసుకురావడమే బిజెపి కర్తవ్యంగా కనిపిస్తోంది.
దేశంలో 80 శాతం మేరకు తామంతా హిందువుల మన్న భావంతో ఉన్నారు కనుకనే మతాల మద్య జరుగుతున్న విభజన వాదంలో వీరిలో ఎక్కువ శాతం తమ వైపు నిలబడుతున్నారని బిజెపి ప్రగాడంగా నమ్ముతోంది. హిందు వోట్ల మద్దతుతోనే దేశంలో 2014 లో అధికారంలోకి రాగలిగి రెండో దఫా కూడ అధికారం నిలుపుకునేందుకు ఈవోట్లు తోడ్పడ్డాయని ఆ పార్టి నేతలు గట్టిగా విశ్వసించబట్టే తమ ఎజండాను గ్రామాల వరకు చేర్చే పనిలో పడ్డారని విమర్శలు ఉన్నాయి. ఏమైన బిజెపి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఓ వైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మరో వైపు కాంగ్రేస్ పార్టీకి సవాల్ గా మారింది.
మహేందర్ కూన, జర్నలిస్ట్