చార్మినార్‌ ‌వద్ద నామజ్‌ ‌కోసం సంతకాల సేకరణా?

  • కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు
  • మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన
  • రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీఎనిమిదేళ్ల పాలన భేష్‌ అని అన్నారు. మోదీ సుపరిపాలనను తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్‌ ‌సాధించిన దానికంటే.. ఎనిమిదేళ్ళల్లో మోదీ రెట్టింపు అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ ‌రైతు ద్రోహి అని…సీఎం మూర్ఖత్వంతో కనీస మద్దతు ధర కూడా రావటం లేదని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తే.. కేసీఆర్‌ ‌బికారులుగా మార్చారని అన్నారు.

కేసీఆర్‌ ‌ప్రభుత్వం భవిష్యత్‌లో ఉంటుందో.. పోతుందో నమ్మకం లేదని తెలిపారు. డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇళ్ళ విషయంలో కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పేదలను మోసం చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్ళల్లో పది వేల మందికి కూడా కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వలేకపోయిందన్నారు. రైతుబంధు ఇచ్చి..రైతులకు అందాల్సిన అన్ని పథకాలను కేసీఆర్‌ ‌బంద్‌ ‌చేశారని అన్నారు. ఫసల్‌ ‌బీమా యోజన పథకాన్ని కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌నీరు గార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌ ‌మాత్రమే వ్యవసాయం చేసి కోటీశ్వరుడు అయ్యారన్నారు. 2014కు ముందు కుంభకోణాల్లో కాంగ్రెస్‌ ‌రికార్డులు సృష్టించిందన్నారు. మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించిన ఘనత మోదీ సర్కార్‌ ‌దే అని చెప్పారు. అయోధ్య రామమందిరం నిర్మాణంతో హిందువుల కలను సాకారం చేసిన నేత మోదీ అని కొనియాడారు. కోవిడ్‌ ‌నుంచి భారతదేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి ప్రధాని అని తెలిపారు. జూన్‌ 14 ‌వరకు మోదీ సుపరిపాలనపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

టీకా కోసం ఇతరదేశాలు ప్రధాని మోదీకి విజ్ఞప్తులు పంపుతున్నాయని బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం వి•ద చేయి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌విసిరారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, ‌టీఆర్‌ఎస్‌ ‌కలిసి డ్రామాలు చేస్తున్నాయన్నారు. భాగ్యలక్ష్మీ దేవాలయం లేదనేవాడు మూర్ఖుడని మండిపడ్డారు. అమ్మవారి శక్తిని తాము..గుర్తించాము కాబట్టే..ఇప్పుడు మసీదు గుర్తొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ ‌నేతల సంతకాల సేకరణను ముస్లిం సమాజం కూడా హర్షించదన్నారు. చార్మినార్‌ను తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు.  చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతించాలని చేపట్టిన సంతకాల సేకరణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటేనే నమాజ్‌ ‌గుర్తుకు వొచ్చిందా అని నిలదీశారు.

పాతబస్తీని ఎంఐఎం కేవలం వోటు బ్యాంకుగానే చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌రాష్ట్ర సెక్రటరీ రషీద్‌ ‌ఖాన్‌ ‌చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతించాలని చేపట్టిన సంతకాల సేకరణపై తీవ్రస్థాయిలో ఆయన స్పందించారు. ముస్లిం మేధావి వర్గం ఆలోచించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఐఎం పార్టీ ముస్లింలను కేవలం వోటు బ్యాంకుగా చూస్తున్నది. ఓల్ట్ ‌సిటీ న్యూ సిటీ ఎందుకైతలేదు. గోకుల్‌ ‌చాట్‌, ‌సాయిబాబా టెంపుల్‌, ‌లుంబినీ పార్కులో బాంబులు పేల్చింది ఎవరు? దేశంలో ఏ సంఘటన జరిగినా ఓల్ట్ ‌సిటీ పేరు ఎందుకు వొస్త్తుందన్నారు. చార్మినార్‌ను తొలగించాలని తామెప్పుడూ చెప్పలేదని బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, ‌తెరాస కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. పాతబస్తీ యువతకు పాస్‌పోర్టు ఎందుకు రావడం లేదన్నారు. ఇరుకు రోడ్లలో ఎన్నో ఏళ్లుగా ఎందుకు మగ్గుతున్నారని రషీద్‌ఖాన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రాదని బండి సంజయ్‌ ‌నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page