పాలస్తీనాపై దాడులకు ఊతమిచ్చే ఒప్పందాన్ని రద్దచేసుకోవాలి..
మానవ హక్కుల వేదిక డిమాండ్ ..
గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు సరఫరా చేసేందుకు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దుచేసుకోవాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ, ఎస్ఎస్ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు. ఇటీవల ఇజ్రాయిల్ తో జరిగిన వ్యాపార ఒప్పందంలో ఉపరితలం నుంచి బాంబులు ప్రయోగించే డ్రోన్లు సరఫరాకు గౌతమ్ అదానీ ఏర్పాట్లు చేసుకున్నాడని తెలిపారు. ఈ అనైతిక, అమానవీయ ఒప్పoదాన్ని రద్దు చేయాలని కోరారు. అదానీ ఎల్బిట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే సంస్థ హైదరా బాదులో అత్యాధునిక డ్రోన్ న్లను తయారు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ పాలస్తీనా ప్రజలపై మారణ హోమం సృష్టించడానికి 900 డ్రో న్లను సరఫరా చేసిందని, ఇజ్రాయిల్ ప్రపచంలోనే అత్యంత ఆధునిక మారణాయుధాలను తయారు చేసిందని, హర్యానా, పంజాబ్,ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతుల పై ప్రయోగించిన పెల్లెట్లు కూడా మన మన దేశం ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకుందని ఆరోపించారు. అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని మారణ హోమంగా ప్రకటించిందని గుర్తుచేశారు. భారత దేశం విజ్ఞత కోల్పోయి ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నామని, మన దేశంలోని ఆలోచనాపరులు, ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వం ద్వారా గౌతం అదానిపై వత్తిడి చేసి ‘డ్రోన్ల ‘ ఎగుమతి ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.ఎస్.కృష్ణ,ఎస్.జీవన్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో
డిమాండ్ చేశారు.