అందుకే రాహుల్ సభకు అనుమతి నిరాకరణ
హైకోర్టుకు ఓయూ అధికారుల సమాధానం
ప్రజాతంత్ర , హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు తావు లేదనీ, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతి నిరాకరించామని ఓయూ అధికారులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీలో ఈనెల 7న తలపెట్టిన విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోసం ఎన్‌ఎస్‌యూఐ నేతలు మానవతారాయ్, ప్రతాప్ రెడ్డి, జగన్నాథ్ తదితరులు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ కార్యక్రమానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైకోర్టుకు వేసవి సెలువల దృష్ట్యా పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాన్న విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేనారెడ్డి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఓయూ అధికారులు ఎన్‌ఎస్‌యూఐ నేతల దరఖాస్తుపై రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలనకు తావు లేదనీ, అంతే కాకుండా ఓయూలో అధ్యాపక సంఘాల ఎన్నికలు, విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌యూఐ నేతల పిటిషన్‌పై ఈనెల 5లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించ•గా, ఈలోపే రాహుల్ సభకు అనుమతి ఇవ్వలేమని ఓయూ అధికారులు స్పష్టం చేశారు.