కేసీఆర్ లేకపోతె తెలంగాణా సాకారమయ్యేది కాదు ..

ఈ దేశంలో ఎక్కడైనా సరే పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అయినా ఇస్తే.. నేను ఏ చర్చకైనా సిద్ధమే! మన పక్కనున్న స్టేట్‌ ‌కమిషన్‌ 4 ‌వేల ఉద్యోగాలిస్తే మనం 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో భాగంగానే 20 వేల టీచర్‌ ‌పోస్టులను ఇచ్చాం. పునర్నిర్మాణంలో మరో ముఖ్యమైంది.. గురుకులాలు. ఐదున్నర లక్షల మంది బీద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల పిల్లలు మూడుపూటలా తిని మంచి విద్యను పొందుతున్నారు. ఆ గురుకులాల నుంచి వందల్లో.. వేళల్లో ఇంజనీర్లవుతున్నారు.. డాక్టర్లు అవుతున్నారు. అది తెలంగాణ పునర్నిర్మాణం కాదా  ..దేశంలో ఎక్కడలేనన్ని మెడికల్‌ ‌సీట్లు ఇక్కడ వచ్చాయి. 33 మెడికల్‌ ‌కాలేజీలు వచ్చాయి. ఏదిఏమైనా ఒక స్పష్టమైన పునర్నిర్మాణం అనేది జరిగింది..  

ప్రొఫెసర్‌ ‌గా , రాజకీయ విశ్లేషకుడిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీఎస్‌పీఎస్సీ) తొలి ఛైర్మన్‌ ‌ఘంటా చక్రపాణి 2014 నుంచి 2020 వరకు ఆ పదవిలో ఉండి మెరుగైన ఫలితాలను సాధించి ఆ పదవికే వన్నెతెచ్చారు. టీఎస్‌పీఎస్సీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు . 1985లో జర్నలిస్ట్ ‌గా జీవితాన్ని ప్రారంభించిన ఘంటా చక్రపాణి 1990లో జర్నలిజం నుండి టీచింగ్‌ ‌వైపు మర్లారు. కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌ ‌గా చేశారు. 1994లో డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ఓపెన్‌ ‌యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ‌ప్రొఫసర్‌ ‌గా చేరి, 2009లో ప్రొఫెసర్‌ ‌గా పదోన్నతి పొందారు. ఆయన బోధన రంగంలో విశిష్ట సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2014లో తెలంగాణ ప్రభుత్వ అవార్డు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో టీవీ చర్చాగోష్ఠుల్లో పాల్గొనేవారు.డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌  ఓపెన్‌ ‌యూనివర్సిటీలో సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయనను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 17 డిసెంబర్‌ 2014‌న జీవో 169 జారీ చేసింది. ఇలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీఎస్‌పీఎస్సీ) తొలి ఛైర్మన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్‌ ‌ఘంటా చక్రపాణి తో ఇంటర్వ్యూ….

మీ బాల్యం, విద్య, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడానికి ప్రేరణ, సందర్భాలు వివరిస్తారా?
-మాది కరీంనగర్‌ ‌జిల్లా యాస్వాడ్‌ ‌గ్రామం. ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఎందుకడిగారనిపిస్తుంది. ఇది తప్పదా అనేవాడిని ఎందుకంటే కొన్ని ఆనవాళ్లు నిర్వాసితులకు ఉండవు. నేను సైతం ఓ నిర్వాసితుడిని. చెప్పుకోవాలంటే రెండు రకాల నిర్వాసితులు ఉంటారు. ఈ ప్రాజెక్టులు, అభివృద్ధి అనే ఒక బూటకపు నమూనాతోటి కొన్ని కోట్ల మంది ప్రజలు భారతదేశంలో వాళ్ల సొంతవూరును కోల్పోవలసి వచ్చింది. అట్లాంటి వారిలో నేనూ ఒకడిని. మాకు లోయర్‌ ‌మానేరు డ్యామ్‌ అని ఇది పోచంపాడు ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీళ్లు తీసుకువచ్చే రిజర్వాయర్‌. అం‌టే ఒక డ్యామ్‌ ‌నిర్మించినప్పుడు ఆ డ్యామ్‌ ‌లో 18 గ్రామాలు డిస్‌ ‌ప్లేస్‌ అయ్యాయి. అలా డిస్‌ ‌ప్లేస్‌ అయిన గ్రామాల్లో యాస్వాడ్‌ అనే మా ఊరు కూడా ఒకటి. నేను 8-10 తరగతులకు వచ్చే సమయంలో అంటే 1984లో మా గ్రామం నుంచి వెళ్లి పోవలసి వచ్చింది. అలా బాల్యం, విద్య నేపథ్యం అనేది ఎంతో ఇబ్బందికరంగా సాగింది. ముఖ్యంగా మా బాల్యం అనేది నీటిలో మునిగిపోయే బుడగలా ఉండేది. కాబట్టి అది ఒక విషాదం. ఇక రెండోది పబ్లిక్‌ ‌లైఫ్‌.. ఈ ‌దేశంలో కొన్ని కమ్యూనిటీస్‌ ‌డిస్‌ ‌ప్లేస్‌ అయిఉంటాయి. వీళ్లు గ్రామాల్లో ఉంటారు కానీ.. అది వారి గ్రామం కాదు. అలా ఉన్నవారిలో ముస్లిమ్స్, ‌దూదేకుల అయిఉండొచ్చు.. క్రైస్తవులు కావొచ్చు.. దళితులు.. బీసీ కులాలు ఇలా.. ఎవరైనా అయి ఉండొచ్చు. మెయిన్‌ ‌స్ట్రీమ్‌ ‌విలేజ్‌ ‌తోటి ప్రేమ, అనురాగం, మిగతావి అగ్రవర్ణాలు వర్ణించినట్టుగా ఆ ఊర్లను వర్ణించలేరు. ఈ రెండు విషాదాలు ఉంటాయి. మాకు కూడా అటువంటి నేపథ్యం ఉండేది.

మా యాస్వాడ్‌ అనే ఊరు కరీంనగర్‌ ‌పక్కనే. మధ్యలో మానేరు అనే పెద్ద రివర్‌ ఉం‌డేది. అంటే గోదావరి అంత పెద్దది. మానేరు డ్యామ్‌ ‌వచ్చాక అది పోయింది. ఈ ప్రాసెస్‌ అం‌తా ఐదారు సంవత్సరాలు నడిచింది. 1975-76లో నాది 5వ తరగతి అయిపోయింది. మాకు అప్పటికే తెలుస్తోంది.. మా ఊర్లు అన్నీ మునిగిపోతున్నాయని.. మేమంతా నిర్వాసితులం అవుతున్నామని. ఇదంతా ఒక సమస్య అయితే.. అలా మునిగిపోతున్న ఊర్ల ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చిన ప్రాంతాలకు, వారి వారి బంధువులు ఉన్న చోటుకు వెళ్లి పోతున్నారనే వార్త బాగా వ్యాపించింది. అలాంటప్పుడు మా స్కూల్‌ ఎక్కడికి పోతుంది? స్కూల్‌ ‌తో ఉన్న బాల్యం ఎక్కడికి పోతుంది? మా ఫ్రెండ్స్ అం‌తా ఏమైపోతారు? అనే చర్చ మా బాల్యంలో అంటే ఐదవ తరగతిలోనే ఉండగానే జరిగేది. ఇలాంటి అస్పష్టమైన గమ్యంలేని ప్రయాణం జరుగుతున్న సమయంలో ఒక రోజు ఒకాయన దాదాపు 25 ఏళ్ల మనిషి మా గ్రామానికి వచ్చాడు. గెడ్డంతో ఉన్న ఆయనను మా హెడ్‌ ‌మాస్టర్‌ ‌తీసుకొచ్చారు. అప్పుడు ఆయన మాకు ఏమని చెప్పారంటే.. మీ ఊర్లు అన్నీ పోతున్నాయి. మీరంతా చెల్లాచెదురు అవుతున్నారు.. మీకు భవిష్యత్తు లేకుండా అవుతోంది అని చెప్పాడు. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ప్రభుత్వ హాస్టళ్లు వచ్చాయి. ఈ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి మంచి వసతి లభిస్తోందని..ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పిల్లకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని… పూర్తిగా ఉచిత విద్యతో పాటు, డ్రెస్సులు, సబ్బులు లభిస్థాయిని చెప్పాడు. ఇది చాలా బాగుందనిపించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి రాకపోయి ఉంటే తెలంగాణా కల సాకారమయ్యేది కాదు. తెలంగాణా కోసం గతంలో చాలామంది సభలు పెట్టి ప్రయత్నాలు చేశారు. ప్రయోగాలు చేశారు. అలా చేసిన వాళ్లంతా తమతమ స్వప్రయోజనాలకోసమే అన్నది స్పష్టం. వాళ్లందరికీ భిన్నంగా కేసీఆర్‌ ‌పెట్టినటువంటి పార్టీ .. తెలంగాణ పై కేసీఆర్‌ ‌కు ఉన్న అవగాహన.. ఆలోచన వేరు. 

నాకు బాగా చదువుకోవాలని ఉండే. కానీ మా ఇంట్లో మాది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్‌ ‌మొగిలయ్య. అమ్మ జనని. మేము అరుగురం, ముగ్గురు సిస్టర్స్. ‌ముగ్గురు అన్నదమ్ముల్లో నేను రెండోవాడిని. అగ్రికల్చర్‌ ‌తో పాటు.. పంబాల అనే గ్రామదేవతలను పూజించే కమ్యూనిటీ ఉండేది. మాకు 20, 30 గ్రామాలమీద వతన్‌ ఉం‌డేది అంటే పెత్తందారీతనం. ఆయా గ్రామాలమీద వచ్చే వతన్‌ ‌తోటి నడిచేది. అప్పుడు మా నాన్న హాస్టళ్ల కు వద్దు అది అనాథలకు చెందేది అనే వాడు. అయినా హాస్టల్‌ ‌కు వెళ్ళాను. 10వ తరగతి వరకు హాస్టల్‌ ‌లోనే గడిపాను. అక్కడ వారు బాగా చూసుకున్నారు. అలాంటి ఓ సమయంలో మా వార్డెన్‌ ‌కనిపించకుండా పోయాడు. కొత్త వార్డెన్‌ ‌వచ్చాడు. అయితే.. అలా అదృశ్యమైన ఆయన రాడికల్‌ ‌యూత్‌ ‌లీగ్‌ ‌లోకి వెళ్ళిపోయాడు. ఆయనే బి.ఎస్‌.‌రాములు. అట్లా నా జీవితంలోకి బి.ఎస్‌.‌రాములు ప్రవేశించాడు. నా 7, 10 ఏళ్ల వయస్సులో ఒక రకంగా ఒక మలుపుతిప్పిన వ్యక్తి. బి.ఎస్‌.‌రాములు ఆయనకు ఫస్ట్ ‌వార్డెన్‌ ‌పోస్ట్ ‌మా ఊరిలోనే వచ్చింది. అప్పుడు ఆయన బాగా శ్రద్దపెట్టి దళితపిల్లను తీసుకొచ్చి బాగా చదివిచాలనేది ఆయనకు వచ్చింది. ఆసమయంలోనే ఆర్‌.‌వై.ఎల్‌ ‌ఫామ్‌ అయింది. ఆయన అండర్‌ ‌గ్రౌండ్‌ ‌లోకి వెళ్లిపోవడం జరిగింది. ఈ లోపు ఎలగందులో నా టెన్త్ అయిపోయింది. అలా చదువుతో పాటు, పండించిన కూరగాలను కూడా నేను అమ్ముకొచ్చేవాడిని. అలాగే మా గ్రామం కూడా డిస్‌ ‌ప్లేస్‌ అయిపోయింది. అప్పుడు మా ఫాదర్‌ ‌తో పాటు ఓ కొత్త విలేజ్‌ ఏర్పడింది. అలా చాలా రకాలైనటువంటి శ్రమతో కూడిన బాల్యం, విద్య సాగిపోయిందని చెప్పొచ్చు. కొన్ని సార్లు దానిని వర్ణించుకునే అవకాశం కూడా ఉండేది కాదు.
ఇక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడానికి ప్రేరణ, సందర్భాల విషయాలకొస్తే… నిజానికి బి.ఎస్‌.‌రాములు అనే వ్యక్తి పసితనంలో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి సామాజిక ఉద్యమాల్లో చేర్చి.. ఆయన ఇంకొక ప్రపంచంలోకి వెళ్లిపోవడమనేది ఒక గొప్ప ప్రపంచం. కరెంట్‌ ‌లేక చీకటిలో ఉన్న గ్రామం మాది. చదువుకోవాలంటే ఒకే గదిలో ఉండేవాళ్ళం. రాజకీయాలంటే అర్ధం అవని సరిపోని వయసులో మాకు రాజకీయాలను నేర్పాడు బి.ఎస్‌.‌రాములు. రెండోది ఎలగందులో 6వ తరగతి చదువుకుంటున్న సమయంలో ఆదివారమైతే తెల్ల బట్టలేసుకుని ఓ ఫాదర్‌ ‌వచ్చేవాడు. ఆయన వచ్చి దేవుని బిడ్డలు అంటూ రకరకాల కరపత్రాలు ఇచ్చేవాడు. మా ఊర్లో మతమనేది ప్రామాణికంగా లేకుండేది. మన ఊర్లో ఉన్న పోచమ్మ, ఎల్లమ్మనే కాదు.. జీసెస్‌ ఉం‌టాడు.. రాముడుంటాడు.. అల్లా ఉంటాడు అని అప్పుడే అర్ధమయింది. అంతే కాదు.. మా హాస్టల్‌ ‌పక్కన ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌శాఖ నడిచేది. మేము చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఆ సమయంలో చూడనిచ్చే వాళ్ళు. కానీ రానిచ్చే వాళ్ళు కాదు. సామాజిక స్పృహ కలగడం అనేది మేము హాస్టల్లో ఉండగానే జరిగింది. అందుకు మాకు హాస్టలే కేంద్రం. మతవ్యాప్తికి హాస్టలే కేంద్రమయింది. పిల్లలు కూడా అమాయకంగా ఆ మత బోధకుడి వద్దకే వెళ్లేవారు. అది నడుస్తున్నప్పుడే అప్పుడే మొదలవుతున్న లెఫ్ట్ ‌మూమెంట్‌ ‌వల్ల విద్యార్ధి నాయకులు, సెంట్రల్‌ ఆర్గనైజర్లు, ఆర్‌.ఎస్‌.‌యూ, పీ.డీ.ఎస్‌.‌యూ లీడర్లు వచ్చేవాళ్ళు. ఇట్లా కొత్త వాతావరణం అనేది అప్పుడే మొదలైంది. ఒక జానపద కథల్లాగా మాకు విప్లవ రాజకీయాలు తెలిసొచ్చాయి. ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి.. భయాన్ని పోగొట్టడానికి అప్పడు అనేక పాటలు జనాల్ని చైతన్యవంతం చేశాయి. అవన్నీ కూడా మాకు సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి, ప్రాపంచిక దృక్పథం ఏర్పడడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. ఇలా అనేక విషయాలు మేము 74-75 నుంచి 80 వరకు చదువుకున్నాం. అప్పట్లో కరపత్రాలే ప్రధాన పాత్ర పోషించేవి. అప్పుడున్న వాతావరణమంతా వామపక్ష భావజాల వ్యాప్తిలో ఉన్నటువంటిది కాబట్టి సామాజిక అంశాలు, ఆర్ధిక అంశాలు అర్ధమయేవి.
-మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?
-నాది ప్రేమ వివాహం. భార్య పుష్పసీనియర్‌ ‌ప్రొఫెసర్‌. ‌కూతురు అమేయ, కొడుకు రాహుల్‌ ‌మిలింద్‌.

తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష మీకు ఎపుడు…అంటే ఏ వయస్సులో కలిగింది..?
-నిజానికి అప్పుడు మా గ్రామాలకు ఎలాగైతే మతబోధకులు వచ్చేవారో.. అలాగే ఆర్‌.ఎస్‌.‌యూ, పీడీఎస్‌ ‌యూ నాయకులూ వచ్చేవారు. వామపక్ష భావజాలం అధికంగా ఉన్న సమయమది. అప్పుడే 82-83 మధ్య ఎన్‌.‌టి. రామారావు అధికారంలోకి రాబోతున్నారు. నా ఇంటర్‌ అయిపోయింది. అప్పటికి చాలా వరకు నా క్లాస్‌ ‌మేట్స్ , ‌రూమ్‌ ‌మేట్స్ అం‌డర్‌ ‌గ్రౌండ్‌ ‌కి వెళ్లిపోయారు. అప్పడు మా రూముల్లోనే పెద్దపెద్ద నాయకులూ అనే వారు వచ్చి విద్యార్థుల వద్దే షెల్టర్‌ ‌తీసుకునేవారు. ఆ విధంగా మాకు వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.. చాలా విషయాలు తెలిసొచ్చాయి. డిగ్రీ లో చేరి డిస్‌ ‌కంటిన్యూ చేశా. మా అన్నకు నన్ను డాక్టర్‌ ‌చేయాలనే పట్టుదల ఉండేది. నేను మెడిసిన్‌ ‌చదవకుండానే వచ్చేశా. తర్వాత కరీంనగర్‌ ‌లో టీచర్‌ ‌ట్రైనింగ్‌ ‌లో చేరి పూర్తి చేశాను. ఆ సమయంలోనే తెలంగాణా ఉద్యమం మొదలయింది. నేను ఉద్యోగం కోసం వెతుకుతూ కరీంనగర్‌ ‌నుంచి వచ్చే ‘జీవగడ్డ’లో చేరాను. మంచి విప్లవ భావాలు ఉన్న విజయకుమార్‌ ‌నేతృత్వంలో వచ్చే దినపత్రిక అది. ఆ పత్రిక ఎందరో జర్నలిస్టులను సమాజానికి అందించింది. అక్కడ నాకు కె.ఎన్‌ .‌చారి, అల్లం నారాయణ, నరేందర్‌ ‌ల పరిచయం ఏర్పడింది.

ఆ సమయం 86-87లో నాకు తెలంగాణా అస్థిత్వము, దళిత అస్థిత్వము పెద్దగా తెలియదు. అప్పుడు జరిగిన సెమినార్‌ ‌లో నేను ఓ జర్నలిస్టుగా పాల్గొన్నా. చాలామంది ప్రసంగాలు విన్నా. అప్పుడే జయశంకర్‌ ‌సార్‌ ‌ని ఇంటర్వ్యూ చేశా. మంచి పేరొచ్చింది. అట్లా 1986-87లో నాకు తెలంగాణా ఆకాంక్ష కలిగింది. అదే సమయంలో ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ‌టూర్‌ ‌కి వెళ్లడం జరిగింది. ఇలా నాకు 1987 కల్లా తెలంగాణపై స్పష్టమైన దృక్పథం రావడానికి అవకాశమిచ్చింది. తర్వాత ఉస్మానియాలో డిగ్రీ సింగిల్‌ ‌సిటింగ్‌ ‌లో రాసి పాసయ్యాను. ఈలోపు కొన్ని కారణాలు.. మరికొన్ని పరిణామాలు జరిగాయి అక్కడ. దాంతోటి నేను కరీంనగర్‌ ‌వదిలేసి రావడం జరిగింది. నేను అప్పుడు ఎన్‌.‌టి.ఆర్‌ ‌పీరియడ్‌ ‌లో వచ్చిన స్పెషల్‌ ‌టీచర్‌ ఉద్యోగం కూడా చేశాను. ఆ స్కీమ్‌ ‌లో నేను 86-87లో టీచర్‌ ‌గా అపాయింట్‌ అయ్యాను.
తర్వాత హైదరాబాద్‌ ‌వచ్చి చిన్న చిన్న పత్రికలతో పాటు, ఆంధ్రభూమి, ఆంధప్రభలో వ్యాసాలు రాసిన నేను జర్నలిస్ట్ ‌డి.ఎన్‌.ఎఫ్‌ ‌హనుమంతరావు దగ్గరికి వెళితే ఆయన ఉద్యోగం ఇచ్చారు. అక్కడ ఇన్నయ్య, సతీష్‌ ‌బాబు పరిచయాలేర్పడ్డాయి. ఆ సమయంలో మేము ‘నేటి రాజకీయం’ అనే పత్రిక కూడా తీసుకొచ్చాం. గద్దర్‌ ‌ఫుల్‌ ‌స్టోరీతోటి వచ్చిన ఆ పత్రిక అప్పట్లో సంచలనం కలిగించింది. అట్లా నేను హైదరాబాద్‌ ‌కు వచ్చి జర్నలిస్టుగానే పనిచేశా. ఆంధ్రజ్యోతి, ఉదయంలో చేశా. అలా చేయడం వల్ల నాకు తెలంగాణాపై మరింత లోతైన అవగాహన కలిగింది. ఆ సమయంలో కాళోజీ, జయశంకర్‌ ‌ల ప్రభావం నాపై పడింది. నేను జర్నలిస్టును, స్టూడెంట్‌ ‌ను కావడం వల్ల తెలంగాణ స్టూడెంట్‌ ‌సంఘాల్లో పనిచేశా. తెలంగాణా మూమెంట్‌ అప్పుడొచ్చింది.. ఇప్పుడొచ్చింది అని చెబుతుంటారు చాలామంది. కానీ తెలంగాణా మూమెంట్‌ అనేది సజీవమైంది. క్యాంపస్‌ ‌లో రెండు మూడేళ్ళలో అలజడి తీవ్రంగా చెలరేగింది. ఆ సమయంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల వల్ల తెలంగాణా వస్తుంది.. మన ఆకాంక్ష నెరవేరబోతోందని గట్టి నమ్మకం కలిగేది. అలా 1992 వరకు నేను ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం జరిగింది.

క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో ఎప్పటినుంచి పని చేసారు..?
– క్రియాశీలకంగా అంటే చదువుల సమయంలోనే తెలంగాణ ఉద్యమం బాట పట్టడం జరిగింది. విద్యార్థిగా కొనసాగుతూనే తెలంగాణ పరిణామాలు.. ప్రయోజనాలు.. వాటి వల్ల ప్రజలకు కలిగే అవకాశాలు ఇలా అనేక రకాలుగా జరుగుతున్న సభల్లోనూ మాట్లాడడం జరిగేది.ఈ క్రమంలోనే జనసభ వచ్చింది. దాని కార్యనిర్వహణ అంతా నేనే చూసుకున్నాను. జనసభ కంటే ముందుగా మేము మా యూనివర్సిటీలో రహస్య సభ పెట్టడం జరిగింది. ఆ సమయంలో గద్దర్‌ ‌తో సహా చాలా మంది పెద్దవాళ్లు వచ్చి తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష దాని ప్రరిణామాలు అన్న అంశాలపై మాట్లాడారు. దాదాపు ఈ అంశంపై మూడు, నాలుగు రోజులు తీవ్రంగా చర్చించడం జరిగింది. అలాగే హైదరాబాద్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో జనసభ కంటే ముందు ఓ మీటింగ్‌ ‌పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక స్పష్టమైన ఎజెండా ఏర్పడింది. ఈ క్రమంలో జరుగుతున్న ప్రతీ మీటింగ్‌ ‌లో, చర్చల్లో నేను పాల్గొ న్నా. అప్పట్లో ఒక దశలో తెలంగాణ అంతా ఒక రెడ్‌ ‌కారిడార్‌ ఏర్పడింది. కేసీఆర్‌ ‌వచ్చారు. 2001లో టి.ఆర్‌.ఎస్‌ ‌వచ్చింది. అలా తెలంగాణతో పాటు వామపక్ష ఉద్యమాల్లోనూ ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగాను. అదే కాలంలో దళిత సంఘాలతోనూ భేటీ కావడం జరిగింది.

ఇక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడానికి ప్రేరణ, సందర్భాల విషయాలకొస్తే… నిజానికి బి.ఎస్‌.‌రాములు అనే వ్యక్తి పసితనంలో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి సామాజిక ఉద్యమాల్లో చేర్చి.. ఆయన ఇంకొక ప్రపంచంలోకి వెళ్లిపోవడమనేది ఒక గొప్ప ప్రపంచం. కరెంట్‌ ‌లేక చీకటిలో ఉన్న గ్రామం మాది. చదువుకోవాలంటే ఒకే గదిలో ఉండేవాళ్ళం. రాజకీయాలంటే అర్ధం అవని సరిపోని వయసులో మాకు రాజకీయాలను నేర్పాడు బి.ఎస్‌.‌రాములు.
తెలంగాణా కల సాకారమవుతుంది అని ఆశించారా…?
– తప్పకుండా ఆశించా. ఈ నేపథ్యంలో తెలంగాణా కల సాకారమవుతుంది అని అప్పుడు జరుగుతున్న పరిణామాలు.. పరిస్థితులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అలా ఆశించడానికి ఎన్నో సంఘటనలు.. మరెన్నో కారణాలు లేకపోలేదు. అందులో ఒకటి తెలంగాణాకు ఉన్న ప్రామాణికత. ఒక స్టేట్‌ ఏర్పడడానికి హిస్టారికల్‌ ‌గా ఉన్న ప్రయోజనాలు. రెండోది తెలంగాణా కోసం ప్రజలు కంటున్న కలలు. ఇక మూడోది తెలంగాణ ప్రజల్లో అప్పటికే ఒక విస్తృతమైన అభిప్రాయం ఏర్పడింది. వామపక్షాలు.. ముఖ్యంగా కేసీఆర్‌ ‌రాక. తెలంగాణ రాష్ట్ర సమితి రాకపోయి ఉంటే తెలంగాణా కల సాకారమయ్యేది కాదు. తెలంగాణా కోసం గతంలో చాలామంది సభలు పెట్టి ప్రయత్నాలు చేశారు. ప్రయోగాలు చేశారు.
అలా చేసిన వాళ్లంతా తమతమ స్వప్రయోజనాలకోసమే అన్నది స్పష్టం. వాళ్లందరికీ భిన్నంగా కేసీఆర్‌ ‌పెట్టినటువంటి పార్టీ .. తెలంగాణ పై కేసీఆర్‌ ‌కు ఉన్న అవగాహన.. ఆలోచన వేరు. నాకైతే… ఇప్పుడు చెప్పిన నాలుగు కారణాలతో పాటుగా అప్పటివరకు 1996-97 వరకు కూడా తెలంగాణా కల కోసం నడిచినటువంటి పోరాటం అంతా బేబీ స్టెప్స్ ‌లానే నడిచింది. కానీ అప్పటికే ప్రజల్లో విస్తృతమైన భావవ్యాప్తి కూడా జరిగిపోయింది. ఆ సమయంలో నేను దాదాపు వంద మీటింగులకు హాజరైఉంటా. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఊళ్లలో, ఉపాధ్యాయుల్లో చదువుకున్న విద్యార్థుల్లో, తెల్లంగాణా జర్నలిస్టుల్లో వాళ్ల బలమైన ఆకాంక్షగా తెలంగాణా నాటుకుపోయింది. అదే సమయంలో తెలంగాణా జర్నలిస్టుల ఫోరమ్‌ ‌వచ్చింది. తెలంగాణా కల సాకారమవడం కోసం అల్లం నారాయణ టీజేఎఫ్‌ ‌పాత్ర మరచిపోలేనిది. ఇలాంటి సమయంలో నమ్మకం రాకుండా ఎలా ఉంటది.. ప్రతీ ఒకరికి నమ్మకమొచ్చింది.

నిరాశకు గురి చేసిన ఉద్యమ లేదా రాజకీయ పరిణామాలు.. మలి దశ ఉద్యమంలో మీ రోల్‌… ‌రాష్ట్ర విభజన లాబీయింగ్‌ ‌వల్లనా… ఉద్యమం ద్వారా సాధ్యమయిందా…?
-నేను చాలా సందర్భాల్లో మూమెంట్‌ ‌లో మొదట్లో కొంత నిరాశ పడ్డ సందర్భాలూ ఉన్నాయి. తెలంగాణాలో అసలేం జరుగుతోంది.. ఉద్యమం ఎటువైపునకు వెళుతోంది? ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు.. పరిస్థితులు నన్ను బాగా కలత పెట్టాయి. ముఖ్యంగా రాజకీయనాయకుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి నిరాశ పడేవాడిని. నేను టీవీల్లో దాదాపు పది సంవత్సరాల పాటు తెలంగాణా కల విషయంలో ప్రతీ రోజు ప్రసారమయ్యే అన్ని ఛానల్స్ ‌ల డిబెటుల్లో పాల్గొన్నాను. ఇలా కొన్నిసార్లు మౌనం కూడా నిరాశ కలిగించింది. నేను అదే సమయంలో కేసీఆర్‌ ‌గారి న్యూస్‌ ‌పేపర్‌ ‘‌నమస్తే తెలంగాణ’లో ‘ఘంటాపథం’అనే కాలం రాశాను. ఆ కాలంలో కేసీఆర్‌ ‌ను ఉద్దేశించి ‘మౌనమే మారణాయుధం?’ అంటూ ఓ ఆర్టికల్‌ ‌రాశాను. నువ్వు మౌనంగా ఉండడమే మారణాయుధమవుతోంది.. ఎదో ఒకటి మాట్లాడు అని కేసీఆర్‌ ‌ను ఉద్దేశించి రాసిన ఆ కాలం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. కేసీఆర్‌ ‌కూడా నిజమే.. బావుంది అన్నారు.

ఆ ఆర్టికల్‌ ‌ని నిరాశలో రాశా. మలిదశ ఉద్యంలో నా రోల్‌ ఏం‌టి అని చెప్పుకోవాలంటే.. ముందే చెప్పగా ఒక వ్యాఖ్యాతగా.. జర్నలిస్టుగా.. తెలంగాణా బిడ్డగా నేను పోషించిన పాత్ర మిళితమై ఉండేది. ఎక్కడ నా అవసరమనుకుంటే అక్కడికి వెళ్ళేవాడిని. ఎంతకాలం మా బలిదానాలు.. మా నీళ్లు, నిధులు.. నియామకాలు అంటూ వివిధ సభల్లో ప్రసంగించేవాడిని. నా రోల్‌ ‌గురించి ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభం నుంచి అంతం వరకు కొనసాగింది. మొదటి భువనగిరి మీటింగ్‌ ‌నుంచి మొదలు పెట్టి చివరికి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చేవరకు కూడా నా పాత్ర ఉంది. ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా రోడ్డు మీద లేకపోయినా.. రోడ్డుమీద ఉన్నటువంటి వారికి కావలసినటువంటి ఆయుధాలను, ఉద్యమంలో ఉన్నవారికి కావలసినటువంటి ధైర్యాన్ని నా మాటలతో, రాతలతో ఇచ్చాను.ఇక రాష్ట్ర విభజన లాబీయింగ్‌ ‌వల్లనా… ఉద్యమం ద్వారానా అంటే… రెండింటి వల్ల అనొచ్చు. ఈ రెండూ సమానమే. రాష్ట్ర ఉద్యమం ఇప్పటివరకూ చెప్పుకున్నటువంటి చరిత్ర ద్వారా సాధ్యమయింది. లాబీయింగ్‌ ‌కూడా చాలా ఉపయోగపడింది. నేనేమంటానంటే 1969లో లాబీయింగ్‌ ‌లేకనే ఉద్యమం విఫలమయింది. అప్పుడు ఇందిరాగాంధీ లాబీయింగ్‌ ‌చేసి చెన్నారెడ్డిని లోబరుచుకుంది. ఆమె స్వయంగా వచ్చి ఇక్కడ లాబీయింగ్‌ ‌చేసింది. కాబట్టి అదే అస్త్రాన్ని రివర్స్ ‌ప్రయోగించారు… తెలంగాణా సాధ్యమయింది.

తెలంగాణ పునర్నిర్మాణం గురించి కాస్త వివరంగా చెప్పండి..?
– తెలంగాణ పునర్నిర్మాణం అనే దానికి ఒక ఇతమిద్ధమైన ప్రణాళిక ఏం చెప్పలేదు ప్రభుత్వం. చాలా మందికి ఉన్న అక్కసుకూడా అదే. తెలంగాణ పునర్నిర్మాణంలో మమ్మల్ని భాగస్వామ్యులను చేయలేదని. ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత పునర్నిర్మాణం అనేది వాళ్లకు వాళ్లు అనుకుంటారు. కానీ నేను ఒక అకాడమిషన్‌ అభ్యర్థిగా అనుకున్నప్పుడు.. కొన్ని ప్రాథమిక, ప్రాధాన్య అంశాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నీళ్ళు. నీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాళేశ్వరం అయి ఉండొచ్చు.. ఇంకేదైనా అయిండొచ్చు. తెలంగాణా నిండుకుండలా మారిపోయింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల నీటి సమస్య అనేది తీరిపోయింది. మిషన్‌ ‌భగీరథని చెప్పుకొచ్చు.

ఈ కులం గోడలను కూలగొట్టి ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థ రావాలంటే చైనాలో వచ్చినటువంటి కల్చరల్‌ ‌రెవల్యూషన్‌ ‌వచ్చి చైనాలో ఎలాగైతే.. ఈ అంతస్థులను కూలగొట్టుకుంటూ.. తొక్కుకుంటూ పోయినారో అటువంటి ఒక విప్లవం రావాలి. ఒక నూతన సాంస్కృతిక విప్లవం రావాలి. అది వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు.

ఇవ్వాళ నీళ్లు అనేవి మన ఇంటిలోకి వస్తున్నాయి. ఈ నీళ్ళ సమస్యని పరిపూర్ణంగా చేయగలిగింది. ఇది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమే. అలాగే రైతుభీమా కూడా. ఇవ్వాళ ఎందరో రైతుల కళ్లల్లో నీళ్లు తుడిచింది. ఇక నియామకాల గురించి మాట్లాడితే.. ఎక్కడలేని విధంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి. ఈ దేశంలో ఎక్కడైనా సరే పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అయినా ఇస్తే.. నేను ఏ చర్చకైనా సిద్ధమే! మన పక్కనున్న స్టేట్‌ ‌కమిషన్‌ 4 ‌వేల ఉద్యోగాలిస్తే మనం 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో భాగంగానే 20 వేల టీచర్‌ ‌పోస్టులను ఇచ్చాం. పునర్నిర్మాణంలో మరో ముఖ్యమైంది.. గురుకులాలు. ఐదున్నర లక్షల మంది బీద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల పిల్లలు మూడుపూటలా తిని మంచి విద్యను పొందుతున్నారు. ఆ గురుకులాల నుంచి వందల్లో.. వేళల్లో ఇంజనీర్లవుతున్నారు.. డాక్టర్లు అవుతున్నారు. అది తెలంగాణ పునర్నిర్మాణం కాదా  ..దేశంలో ఎక్కడలేనన్ని మెడికల్‌ ‌సీట్లు ఇక్కడ వచ్చాయి. 33 మెడికల్‌ ‌కాలేజీలు వచ్చాయి. ఏదిఏమైనా ఒక స్పష్టమైన పునర్నిర్మాణం అనేది జరిగింది. ఇక ఆర్థిక రంగం విషయానికొస్తే.. తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గానే ఫలితాలు సాధిస్తోంది. ఈ విషయంలో తెలంగాణా నెంబర్‌ ‌వన్‌ ‌గానే ఉందన్న విషయం మనం చూస్తున్నదే.

రాష్ట్రంలో కొందరు నిరుద్యోగ యువత నియామకాల పట్ల ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు… అందుకు రాష్ట్ర మొదటి పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌చైర్మన్‌ ‌గా మీరు ఎంతవరకు బాధ్యులు..వారికి మీ సూచన…సలహా..?
– నేను బాధ్యుడిగా ఉండను. ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుంది. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఉద్యాగాలను సృష్టించదు. ఉద్యాగాలను డెలివరీ మాత్రమే చేస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా ఉద్యోగాల ప్రణాళిక.. ప్లానింగ్‌ ‌గవర్నమెంట్‌ ‌చేస్తుంది. ఎన్ని ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇవ్వాలి అనే స్వేచ్ఛ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కు ఉండదు. మాకు ఇచ్చినటువంటి 42వేల ఉద్యోగాల్లో మేము ఉన్న ఆరు సంవత్సరాల కాలంలోనే 104 నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపుగా అన్ని నోటిఫికేషన్లు ..ఒక్క పీఈటీ తప్ప 42 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక్క అవినీతి లేకుండా.. ఎవరికీ అన్యాయం జరగకుండా తెలంగాణా స్టేట్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అన్నీ సమర్థవంతంగా పోషించిందని మేము గర్వంగా చెప్పుకుంటాం.

ఆంధ్ర పారిశ్రామికవేత్తలకు, సినిమా పరిశ్రమ పైన తెలంగాణా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలంగాణవాదుల అభిప్రాయం..
– నిజమే అది. సినిమా పరిశ్రమ అనేది పెద్ద ఇండస్ట్రీలాంటిది. వినోదరంగం ప్రయోజనాలు ఎన్నో. ఆర్థికపరంగానూ దాని ప్రాధాన్యత ముఖ్యమైనదే. అందుకే ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిచడంలో ముందుంటుంది. ఎక్కడినుంచైనా ఎవరైనా మన ప్రాంతంలో ఇండస్ట్రీ పెడతామని వస్తే ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిచాల్సిందే. నువ్వు ఆంధ్రోడివా.. బీహారోడివా.. ఇలా చూడాలన్న రూలేమీ ఉండదు. ప్రోత్సహించాల్సిందే.

రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పాల్గొన్న జర్నలిస్టులకు … వారికి అండగా నిలిచిన పత్రికలకు.. స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కింది అని మీరు భావిస్తున్నారా..?
-లేదు… భావించట్లేదు. సముచితమైన స్థానం అంటే ఒకటి తెలంగాణా పత్రికలు.. ఆంధ్రపత్రికలు. తెలంగాణా రాష్ట్రం వచ్చాక తెలంగాణా పత్రికలు బాగా అంటే విస్తృతంగా వస్తాయనుకున్నా. ఆంధ్రపత్రికలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో నేను పాల్గొన్నా. టీవీ ఛానెల్లో కూర్చోని ఆంధ్రోళ్ళను తిట్టొచ్చా. కొన్ని తెలంగాణా పత్రికలొచ్చినప్పటికీ అందులో ‘ప్రజాతంత్ర’ ముందే వచ్చింది. తెలంగాణా ఉద్యమంలో తనవంతు పాత్రని సమర్ధవంతంగా పోషించింది. గత 25 ఏళ్లుగా ఆ పత్రిక తన స్థానాన్ని పదిలపరచుకుంటూనే సాగుతుంది. ఇది ఎందుకు పెద్ద పత్రిక కాలేదు అన్నది ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ తెలంగాణా పత్రికలనేవి చిన్న పత్రికలుగానే మిగిలిపోయాయి. వీటి ప్రాతినిధ్యం పెరగాలనే నేను కోరుకుంటున్నా.

ధనం,ఇతర ప్రలోభాల తో కూరుకు పోయిన ఇప్పటి ఎన్నికలపై.. రాజకీయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న ప్రతికూల వాతావరణం పై సామాజిక వేత్తగా మీ అభిప్రాయం… మార్పునకు సూచనలు?
-ఎన్నికల వ్యవస్థ బాగా దిగజారిపోయింది. ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని అప్పుడెప్పుడో అన్నారు. కానీ.. ఆ మాట ఇప్పటికీ సజీవంగానే ఉంది. నిజానికి ఎన్నికల పట్ల, ఎన్నికల వ్యవస్థ పట్ల నాకు సదభిప్రాయం లేదు. ఇప్పుడు ఇంకా దారుణంగా తయాయింది. పూర్తిగా డబ్బులతో మాత్రమే ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం చోటుచేసుకుంది. డబ్బుల ప్రమేయం.. మద్యం ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. ఇదొక ఒక్క తెలంగాణాకు అనుకోకండి. దేశవ్యాప్తంగా ఎన్నిక సిస్టమే అట్లా అయిపోయింది. ఎక్కడైనా సరే.. ఈ ధనప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇట్లాంటి డెమోక్రసీని మనం ప్రోత్సహహించొద్దు.

అత్యధిక శాతం జనాభా కలిగిన బడుగు బలహీన మైనారిటీ వర్గాలు అధికారం కోసం ఎందుకు సంఘటితం కాలేక పోతున్నారు.. సామాజిక వేత్త గా పరిశీలన..?
-సంఘటితం కారు. భారతీయ కుల వ్యవస్థ అనేది రాజకీయజీవితంలో పెద్ద అవరోధంగా తయారైంది. కారణం వారిలో ఐక్యత లేకపోవడమే. ఐక్యత ఎక్కడుంది చెప్పండి? ఎవరిలో ఉంది.. బీసీల్లో ఉందా? ఎస్సీ, ఎస్టీల్లో ఉందా? మైనార్టీలో ఉందా? ఐక్యత అనేది పూర్తిగా లోపించింది. కాబట్టే సంఘటితం కాలేకపోతున్నారు. ఈ కులం గోడలను కూలగొట్టి ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థ రావాలంటే చైనాలో వచ్చినటువంటి కల్చరల్‌ ‌రెవల్యూషన్‌ ‌వచ్చి చైనాలో ఎలాగైతే.. ఈ అంతస్థులను కూలగొట్టుకుంటూ.. తొక్కుకుంటూ పోయినారో అటువంటి ఒక విప్లవం రావాలి. ఒక నూతన సాంస్కృతిక విప్లవం రావాలి. అది వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు.

జర్నలిస్టుగా, సామజిక శాస్త్ర ప్రొఫెసర్‌ ‌గా, విశ్లేషకులు గా.. మీరు తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు… అదే స్ఫూర్తి, బాధ్యతతో రాష్ట్ర ఏర్పడిన తరువాత తెలంగాణా సమాజానికి మీరు ఇచ్చే సందేశం…?
-ఎలాగైతే మనం సుదీర్ఘ పోరాటంతో.. సునిశితమైన పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నామో.. ఆ తెలంగాణాను అంతే సునిశితంగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. కాపాడుకోవడమంటే తెలంగాణా ఎటుపోతదో అని కాదు.. ఏ విలువలకోసమైతే మనం తెలంగాణ కావాలనుకున్నామో.. ఆ విలువలను కాపాడుకోవాలి. అప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణా , సామాజిక తెలంగాణా కావాలనుకున్నారో అలా అనుకున్నవాళ్లు ఇవ్వాళ ఎక్కడికి పోయారు? ఈ సామాజిక తెలంగాణా నిర్మిద్దాం రండి.. అదే విధంగా ప్రజాస్వామ్య తెలంగాణా కావాలన్నారు. ఎస్‌.. ఇవాళ రండి ప్రజాస్వామ్య తెలంగాణా కోసం. ప్రజాస్వామ్య తెలంగాణాగా , ఒక సామాజిక తెలంగాణాగా నిర్మించుకోవలసిన లక్ష్యం ఇంకా మిగిలే వుంది. రండి.. ఆ దిశగా అడుగులు కదపండి..

-ఎం.డి అబ్దుల్‌
‘‌ప్రజాతంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page