- కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం
- రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు
- బిజెపి సమావేశంలో తరుణ్ చుగ్,కిషన్ రెడ్డిల వ్యాఖ్యలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్ పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేశారని తరుణ్‌చుగ్ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో వున్నారని చెప్పారు. బిజెపి కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇతరపార్టీముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇందులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబిసి మోర్చా ఛైర్మన్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, పార్టీ అధ్యక్షుడు బండిసంజయ్, పార్టీ కార్యదర్ శివప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ మూడో విడత యాత్ర,ప్రధాని హైదరాబాద్ పర్యటన తదితర అంశాలను చర్చించారు.
ఈ సందర్బంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వ్యక్తి, కుటుంబం కోసం కాదు.. దేశం కోసమే బీజేపీ పనిచేస్తుందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనను జనం అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. తండ్రీ కొడుకుల పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకోని కేసీఆర్.. పంజాబ్ రైతులకు సాయం చేసేందుకు వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు.
దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు వంద మంది కేసీఆర్ లు వచ్చినా మోడీని ఏం చేయలేరని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 2024లోనూ మోడీ సర్కారు మళ్లీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. సైన్స్ సిటీ నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇవ్వమని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైల్వే ప్రాజెక్టులకు భూ సేకరణ చేయకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నం దునే పనులు ముందుకుసాగడంలేదని విమర్శించారు. బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి.. కుటుంబ పాలనను కూకుటివేళ్లతో పెకిలించి వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.