రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి
జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా..
కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది
కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు
బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు
జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 9 : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో వోటుకు నోటు పంచాయితీ ఉంటే..ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వొస్తదట..ఇది మనం అనడం లేదు. కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడని హరీష్ రావు గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో వి•కు తెలుసు, వోటుకు నోటు కేసులో ముద్దాయి. ఇలాంటి పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీకి వి•రే హై కమాండ్. వి•రు ఏది కోరుకుంటే అది చేసే పార్టీ. టీఆర్‌ఎస్ లేకపోతే, సీఎంగా కేసీఆర్ లేకపోతే భూపాలపల్లి జిల్లా అయ్యేదా.. భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వొచ్చేదా..? అని హరీష్ రావు అడిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102 కోట్లతో చేపట్టిన పలు పనులకు సోమవారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 55 కోట్ల వ్యయంతో 200 పడకల హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. రూ. 6 కోట్లతో రేడియోలజీ, పాథాలజీ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ల్యాబ్‌ల్లో ఉచితంగా 56 పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన జేపీ నడ్డాపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీరు పారలేదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును నడ్డా చదివారు. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో, లేదా అనే విషయం తెలుసుకోవాలంటే భూపాలపల్లికి రావాలి. తమ రైతులను అడిగితే నీళ్లు వొచ్చాయా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. చిట్టచివరి టేకుమట్ల దాకా నీళ్లు వొచ్చాయన్నారు. ఆనాడు నీళ్ల కోసం రైతులు తమ కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తే.. నేడు నీరు చాలు, ఆపాలని రైతులు కోరుతున్నారని హరీష్ రావు తెలిపారు. దమాక్ లేని మాటలు నడ్డా మాట్లాడారని ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అనడం సరికాదు. ఈ ప్రాజెక్టుతో పంటలు విరివిగా పండాయని తెలిపారు. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌పై కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఏడేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరిచిపోయారా? ఎరువుల బస్తాల కోసం లైన్లలో నిల్చున్న విషయం గుర్తుందా? అని రైతులను హరీష్ రావు ప్రశించారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు వారి పాలనలో దర్శనమిచ్చేవని గుర్తు చేశారు. ధాన్యం అమ్ముకునేందుకు కూడా రైతులు ఎన్నో కష్టాలను అనుభవించారని పేర్కొన్నారు. కరెంట్ కోతతో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు అని హరీష్ రావు గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.
జేపీ నడ్డా కాదని.. అబద్దాలకు అడ్డా అని ఎద్దేవా చేశారు. ఒకరేమో మోకాళ్ల యాత్ర.. ఇంకొకరేమో పాదయాత్ర.. మరోకరేమో సైకిల్ యాత్ర అంటూ బయలుదేరారన్నారు. బీజేపోళ్లు, కాంగ్రెస్సోళ్లు పాలించే రాష్ట్రాల్లో కనీసం కరెంటు కూడా లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి లేదు… ఆసరా లేదు.. రైతు బంధు లేదా.. రైతుబీమా లేదు. నడ్డాకు దమాక్ ఉందా లేదా..? భూపాలపల్లికి రా.. ఎన్ని ఎకరాలకు సాగునీళ్లు అందాయో చూపిస్తా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా వి• కేంద్రమంత్రే చెప్పిండు. కేంద్ర మంత్రులేమో కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడిదంటే నడ్డా ఏమో అవినీతి జరిగింది అంటుండు. ఏడేండ్ల కిందట పాలించింది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ అంటేనే ఎరువుల కొరత..కాంగ్రెస్ అంటేనే పవర్ కట్లు. ఎరువుల కోసం.. విత్తనాల కోసం కిలోవి•టర్ల మేర లైన్లలో నిలబడటం మరిచిపోయారా? ఒక పార్టీ నేతేమో ఓటుకు నోటు కేసు దొంగ. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారు. కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట. ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారు. అలాంటి పార్టీలు అవని మంత్రి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.