హైదరాబాద్, జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్ సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. దీంతో టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవని తెలిపింది.
సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. అప్పటి వరకూ ప్రత్యామ్నాయ మార్గాలైన మేక్‌మైట్రిప్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. వెబ్ పోర్టల్, యాప్‌లోని సేవలు ఉదయం 8 గంటల నుండి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.