ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. మంగళ్‌హట్‌ ‌పీఎస్‌లో రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్‌ ‌నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ వర్గం వారి ఆందోళనలు, ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాజాసింగ్‌ అప్‌ ‌లోడ్‌ ‌చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో ఓ వర్గం వారు సిటీ పోలీసు కమిషనర్‌ ‌కార్యాలయంతోపాటు భవానీ నగర్‌, ‌డబీర్‌ ‌పురా, రెయిన్‌ ‌బజార్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఫిర్యాదులు కూడా చేయడంతో పోలీసులు స్పందించారు.

కేసు నమోదు చేసి రాజాసింగ్‌ ఇం‌టికెళ్లి అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 4 గంటల తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌నాంపల్లి కోర్టులో బెయిల్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. అయితే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. రాజాసింగ్‌ ‌తరపు న్యాయవాది బెయిల్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేయగా..కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజాసింగ్‌ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కాగా హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ ‌స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. మంగళవారం ఒక్కరోజే ఈ బీజేపీ ఎమ్మెల్యేపై 12 కేసులు నమోదవడం గమనార్హం.

దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ఆయన బెయిల్‌ ‌పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. రాజాసింగ్‌ను నాంపల్లికి తరలించిన సమయంలో నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్‌ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాఉ ఇచ్చారు. రాజాసింగ్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ..కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

ఇదిలా ఉండగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్‌ ‌వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు మంగళ వారం ప్రకటించింది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ ‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. మంగళవారం ఒక్కరోజే ఈ బీజేపీ ఎమ్మెల్యేపై 12 కేసులు నమోదవడం గమనార్హం.ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తాయని రాజాసింగ్‌ ‌ముందే చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page