నిప్పుల కొలిమే!

– ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మండుటెండలు
– 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు
– జనం బయటకు రాలేక అవ‌స్థ‌లు

ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. మండుటెండల తో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతున్నది. ఎండకు వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు గొడుగులు, టోపీలు, తలకు టవల్స్ ‌చుట్టుకుంటున్నారు. మంచినీరు, మజ్జిగ, లస్సీ ఇతర చల్లని పానీయాలు తీసుకుంటున్నారు. మరో నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *