ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ

  • అప్పుల కుప్పగా మార్చిన సిఎం కెసిఆర్‌
  • మండిపడ్డ మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌

‌హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శలు గుప్పించారు. ఇటీవల వరుసగా చేపట్టిన యాత్రలు అందులో భాగమేనని అన్నారు. బుధవారం వి•డియాతో మాట్లాడుతూ..ఎవరు పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ‌వద్ద అపాయిమెంట్‌ ‌కోసం సీఎం కేసీఆర్‌ ‌పడిగాపులు కాయటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులను వదిలి..పక్క రాష్ట్రాల్లో చెక్కులు పంచటం సీఎం కేసీఆర్‌కు తగదన్నారు. 2018లో కేంద్రంలో చక్రం తిప్పుతా అని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడ్డారని ఆయన తెలిపారు. ఉద్యోగులకు జీతాలు, సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వలేక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ ‌దే అని దుయ్యబట్టారు. చట్టాలను మార్చి అప్పులు తీసుకుని వొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిని కాగ్‌ ‌తప్పు పట్టిందన్నారు. ఇలా చేసిన 3 లక్షల 29 వేలకోట్లకు లెక్కలు చెప్పాలని ఈటల రాజేందర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *