విద్యా వ్యవస్థ, కోర్సుల్లో మార్పులు రావాలి

– రాబోయే 20-30 ఏళ్లు భారత్ కు అత్యంత కీలకం
– ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెస‌ర్‌ బాలకిష్టారెడ్డి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 5 : విద్యా వ్యవస్థ, కోర్సుల్లో సమూల మార్పులు రావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఉన్నత విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగంపై క్యాంపిక్స్ ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో గురువారం కొండాపూర్ లోని గూగు ల్ హైదరాబాద్ కార్యాలయంలో నెక్స్ట్ 1.0′ సదస్సు జరిగింది. ‘నెక్స్ట్ జనరేషన్ అకడమిక్ ఎకోసిస్టమ్’ ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు యూని వర్సిటీల వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ రాబోయే 20-30 ఏళ్లు భారత్ కు కీలకమని, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ, కోర్సుల్లో సమూల మార్పులు రావాలని అన్నారు. 21వ శతాబ్దం జ్ఞాన విప్లవానికి నాంది పలుకుతుందని, ఏఐ, ఏవి యేషన్, డిఫెన్స్ వంటి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. క్యాంఫ్ఎక్స్ సీటీఓ యల్లాప్రగడ శ్రీకాంత్ ఏఐ ఫార్వర్డ్ అకడమిక్స్ పై మాట్లాడుతూ జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం, ట్యాబ్లెట్ ఆధారిత పరీక్షల నిర్వహణ, ఏఐ కంటెంట్ స్టూడియో వంటి సాంకేతిక పరిష్కారాలను వివరించారు. సీఈఓ యల్లాప్రగడ వెంకట్ మాట్లాడుతూ ప్రవేశాల నుంచి ఫలితాల వరకు అన్ని ప్రక్రియలను ఒకే డిజిటల్ వ్యవస్థతో అనుసంధానిస్తే సమయం ఆదా అవుతుందన్నారు. సదస్సులో జేఎన్టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ ఎ.దామోదరం, కేఎల్ డీమ్డ్ వర్సిటీ వీసీ జి.పార్థసారథి వర్మ, అనురాగ్ వర్సిటీ వీసీ డాక్ట‌ర్‌ అర్చన మంత్రి, గోదావరి గ్లోబల్ వర్సిటీ వీసీ డాక్ట‌ర్‌ యు.చంద్రశేఖర్, క్యాంపిక్స్ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ మనసా కృష్ణ, ప్రొడక్ట్ హెడ్ డాక్ట‌ర్‌ బాల నాగేంద్ర ప్రసాద్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కేతన్ శ్రీసాయి, గూగుల్ రీజినల్ హెడ్ సిద్దార్థ్ దల్వాడి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *