– ‘వీబీ జీ రామ్ జీ’ కింద 2026-27కి రూ.3,825.3 కోట్లు కేటాయింపు
– గృహ నిర్మాణ పథకం సహా పలు పనులకు విస్తరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంuర్ 5 : వీబీ-జీ రామ్ జీ చట్టం అమలులో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో పనుల అమలును ప్రారంభించడంపై అభినందనలు తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్కకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. వీబీ-జీ రామ్ జీ చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సూచనలపై స్పందిస్తూ లేఖ పంపారు. 2026-27కి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.3,825.3 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆ లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కల్పన, కూలీలకు సకాలంలో వేతనాల చెల్లింపునకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు. ‘వీబీజీ రామ్ జీ’ కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 1.83 కోట్ల పని దినాలు కల్పించారంటూ ఉపాధి కల్పనలో రాష్ట్రం సాధించిన పురోగతికి ఇది నిదర్శనమన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం సూచించిన అదనపు పనులను పరిశీలించి వీబీ జీ రామ్ జీ కింద అనుమతించదగిన పనుల జాబితాను 375 పనులకు విస్తరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గృహ నిర్మాణ పథకంతోపాటు రాష్ట్రం సూచించిన పలు పనులను ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





