కెటీఅర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.
ఆర్మూర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ ప్రచార రథంపై నుంచి పడిన కెటిఆర్, జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డిలకు స్వల్ప గాయాల్యాయి. వారిని వెంటనే జిల్లా కేంద్రానికి తరలించారు. ఆర్మూర్‌లో బిఅర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్ వేసెందుకు అంకాపూర్ నుంచి ఆర్మూరులోని మీది బజార్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్ అలాగే రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనంలో ప్రచారం చేస్తూ వొస్తున్నారు. మార్గమధ్యంలో పాత ఆలూరు రోడ్డు వద్ద స్పీడ్ బ్రేక్ వేయడంతో వాహనం పైనున్న కెటిఆర్, జీవన్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిలు అకస్మాత్తుగా కింద పడ్డారు. దీనితో వారికి స్వల్పగాయాల్యాయి. వెంటనే వీరిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఘనంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేసేందుకు వెళుతున్న ర్యాలీలో అపశృతి చోటు చేసుకోవడంతో ర్యాలీలో పాల్గొన్న వారు ఆవాక్కయ్యారు. ఈ ఆపశృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.