భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

– పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో జరిగిన ఎంవోయూలు, పురోగతిపై ఆయన బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ అంశాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫ్యూచర్ సిటీతోపాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలను సీఎంకు తెలిపారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలన్నారు.  బ్రాండ్ ఉన్న సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *