– గవర్నర్‌ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్.హనుమంతరావులు బుధవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాలు (మే 21 నుంచి జూన్ 1వరకు), గోదావరి పుష్కరాలు (2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు) నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లును గవర్నర్‌కు పవర్‌పాయింట్ ప్పు్రంటేషన్ ఇచ్చారు. పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు శైలజా రామయ్యర్ తెలిపారు. భక్తుల వసతి సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ చర్యలు, ముఖ్య ఆలయాలు–వాటి ప్రాధాన్యత, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిశోర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బుధవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే (ఏవీఎసఎం, వీఎసఎం) బుధవారం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు, సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను ఆయనకు వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





