– విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
– మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ఎక్స్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. గిగ్ వర్కర్లు లోకుర్తి నరేష్, జీ. శ్యామ్ సుందర్అ, హ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా చెక్కులు అందజేశారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్ లో నిర్వహి చిన ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు అండగా నిలుస్తూ అసెబ్లీలో గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టాన్ని ఆమో దించిందని తెలిపారు. గిగ్ వర్కర్లకు ఇలాంటి రక్షణ, భద్రతా వలయం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏ కార్మికుడికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లు అయినా, హమాలీలు అయినా అం దరికీ ప్రభుత్వం నుండి తగిన సహాయం, పరిరక్షణ అందాల్సిందేనని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





