అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ ..
‌మోడీ వి చిల్లర రాజకీయాలు
ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు ..
మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.గురువారం సిద్దిపేట క్యాంపు కార్యాలయం లో మంత్రి హరీష్‌ ‌రావు మీడియా సమావేశం లో  మాట్లాడుతూ ..విభజన చట్ట ప్రకారం తెలంగాణా కు రావలసిన అంశాల పై ప్రధాన మంత్రి హామీ ఇస్తారని ఆశించిన తెలంగాణా ప్రజానీకాన్ని మోడీ పూర్తిగా నిరాశపరచారని అన్నారు. కుటుంబ పాలన్‌ ‌పై మాట్లాడిన మోడీ పలు రాష్ట్రాల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు వంశపారంపర్యం గా అధికారంలో కి వొచ్చినయి కావా అని ప్రశ్నించారు.రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు కోరినప్పుడు కుటుంబ పాలన గుర్తు రాలేదా అని ఎద్దేవా చేసారు .- అమిత్‌ ‌షా కొడుకు బీసీసీఐ అధ్యక్షుడు ఏ అర్హతతో ఎన్నికయ్యాడు .. రాజ్నాథ్‌ ‌సింగ్‌ ‌కొడుకు, పీయూష్‌ ‌గోయల్‌ ‌తండ్రి ఎవ్వరు….బీజేపీ లో లేరా అని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ది తెలంగాణా కుటుంబమనీ ..రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి నమ్మకాలను ప్రధాని విమర్శించడం విడ్డురమనీ ..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్‌ అయితే …అమ్మకానికి మారు పేరు నరేంద్ర మోడీ అని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు.బిజెపి  ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది..వోట్ల  కోసం మత కల్లోలాలు సృష్టించేది బీజీపీ నాయకులే..అని మాట్లాడుతూ ..మీరు అధికారంలోకి వస్తాము అనేది పగటి కల..తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నారు, అమరుల త్యాగాన్ని ఉద్యమాన్ని అవమానించారు..మీకు మాట్లాడే హక్కు లేదు..7 ఏళ్ల పాలనలో ఏం చేశారు%••%వేలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు ..

తెలంగాణను ఐటీ రంగంలో దూసుకుపోయే ఎలా చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇం‌దులో మీరు చేసింది ఏమీ లేదు..అని మంత్రి హరీష్‌ ‌రావు విరుచుకు పడ్డారు.  కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కి మా రైతుబంధు స్ఫూర్తి. అనేక నిబంధనలు పెట్టి దశల వారీగా ఆరువేల రూపాయలు ఇస్తే అంత చెబుతున్నారు. .మా ప్రభుత్వం రైతు బంధు ద్వారా 63 లక్షల మంది రైతులకు 50 వేల కోట్లు ఇచ్చాము%••%మెడి మీకు ఇది కనిపించడం లేదా..అని ప్రశ్నించారు ..వోట్ల కోసం మత కల్లోలాలు సృష్టించేది మీ బీజీపీ నాయకులే.. ఇది గుజరాత్‌ ‌కాదు పోరాటాల గడ్డ. ఉద్యమాల అడ్డ.అని గుర్తు చేస్తూ .సంజయ్‌ ‌మాటలు వినండి. విచ్ఛిన్నం చేసే ..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు అని ప్రశ్నించారు .

బయ్యారం ఉక్కు ఏమైంది..ఖాజీపేట రైల్వే ఫ్యాక్టరీ ఏమైందీ..సంప్రదాయ గ్లోబల్‌ ‌సెంటర్‌ ‌జామ్‌ ‌నగర్‌ ఎలా పోయింది..హైదరాబాద్‌ ‌వరద సాయం ఏమైందీ…నవోదయ, కాళేశ్వరం జాతీయ హోదా..మెడికల్‌ ‌కాలేజీలు ఏమయ్యాయి.పసుపు బోర్డు ఏమైందీ. మోడీ సమాధానం చెప్పాలి అని మంత్రి హరీష్‌ ‌రావు నిలదీసారు .జాతీయ ప్రాజెక్టు ఇవ్వరు, కృష్ణా నదిలో ఎందుకు వాటా తేల్చరు. ఎందుకు ట్రిబ్యునల్‌ ‌వేయరు..మీది అధికారం యావ.. ప్రజల మీద ప్రేమ కాదు..కడుపు నిండా విషం.. ప్రజల మీద అక్కసు…గుజరాత్‌ ‌కంటే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తొక్కి పెడుతున్నారు అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page