అక్షరాన్ని నేను
క్షరం లేదు నాకు
సూక్ష్మాన్ని తెలియచేస్తూ
చీకటిని పారద్రోలి,
విజ్ఞానాన్నీ,
వినమ్రతను నేర్పుతూ
మేధావులనందించే దాన్ని
అభ్యున్నతికి
మూలాధారాన్ని
చింతలన్ని ఏకమైనా,
కునుకమ్మ దూరమైనా,
లాలించి నిదురపుచ్చే
ఊయలని
మస్తిష్కంలో తరగని నిధినై
హృదయానందం కలిగిస్తూ
నిరంతర జిజ్ఞాసను పెంపొందిస్తూ
ఒంటరితనంలో సేదతీర్చే
పుస్తకాన్నై
పదుగురికీ ఉపయోగపడే
స్నేహితుడను
అభివృద్ధికి చిరునామాను
నేను లేని చోటే లేదు
నేనే లేకపోతే
అంతా శూన్యమే…
– వేమూరి శ్రీనివాస్
9912128967, తాడేపల్లిగూడెం