కొత్త ఆలోచనల మార్పిడి

దేశంలోని వివిధ ప్రాంతాలకు వివిధ భాషలకు, చెందిన రచయితలను కలవడానికి, వారి మాటలను వినడానికి సాహిత్య ఉత్సవాలు- అద్భుతమైన అవకాశాలను ఇస్తాయి. ఈ ఉత్సవాలు కేవలం కలయికలుగానే మిగిలిపోకుండా, కొత్త ఆలోచనల మార్పిడికి వేదికలుగా నిలుస్తాయి. ఇందులో పాల్గొనేవారు ఒకరి మాటలను ఒకరు శ్రద్ధగా వింటూ, పరస్పరం ప్రభావితం చేసుకుంటూ, స్పందిస్తూ ఉంటారు. ముఖాముఖి సంభాషణలు మన సాహిత్య సంఘాలను ఎంత సజీవంగా, పరస్పర అనుసంధానంగా, క్రియాశీలంగా ఉంచగలవో నిరూపిస్తూ, ఈ సాహిత్య ఉత్సవాలు అపారమైన వ్యక్తిగత, సాంస్కృతిక విలువలను జోడిస్తాయి. CLF-26లో పాల్గొంటున్న రచయితల జాబితాను చూస్తుంటే, ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన చర్చలు జరుగుతాయని బలంగా అనిపిస్తుంది.

-వివేక్ శానభాగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *