ఏ ఉత్సవమైనా జనాలని కలిపేందుకు కూడలిలా పనిచేస్తుంది. మనుషులకు కొత్త ఉత్సాహానిస్తుంది. ఇతర ప్రదేశాలనుంచి వచ్చినవారిని వినడం బావుంటుంది. వారిభాషలలో కొత్తగా వచ్చిన రచనలు తెలుస్తాయి. వారుకూడా మన రచనలు తెలుసుకుంటారు. కొత్తరచనలు చదవటం వలననే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ప్రదేశాలు కూడా అందుకు కొంత దోహదం చేస్తాయి. ఎప్పుడు ఒకేలా ఉండే మనుషులకు ఇదొక మంచి భిన్న ఆహ్లాదం. ముఖ్యంగా సాహిత్యం గురించిన చర్చలు, సాహితీ రాజకీయాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి, వినిపిస్తాయి. కొత్తతరం పాతతరం మధ్య ఉన్న అంతరాలు అర్ధం అవుతాయి. అర్ధం అవడానికి అవకాశం ఉంది. తమ ఇష్టమైన రచయితలను కవులను ఇతర భాషా సాహితీకారులను, సాహిత్యాన్ని అందుకోవడానికి పాఠకులకి ఇదొక సరైన వేదిక.





