– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు
దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాగు నీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగు రోడ్డు వంటి అభివృద్ధి పనులు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో పాలనపై చెరగని ముద్ర వేసిన నాయకుడు డాక్టర్ వైఎస్సార్ అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, ఎం.అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




