జన ఆకాంక్షల కేంద్రంగా వెయ్యి రోజుల పాలన

-పేదల అవసరాలు, ఆత్మగౌరవాల మేళవింపుతో సంక్షేమం 
– వెయ్యి రోజుల పాలనపై ‘ఎక్స’లో సీఎం రేవంత్ పోస్టు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : జన ఆకాంక్షలే కేంద్రంగా త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలన సందర్భంగా ‘ఎక్స’లో పోస్టు చేశారు. పేదల అవసరాలను, వారి ఆత్మగౌరవాలను మేళవించి సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర దీర్ఘకాలిక భవితను, బిడ్డల ఉపాధిని మేళవించి అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. సకల వర్గాల సామాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను మేళవించి సాగిస్తున్న పాలన వెయ్యి రోజుల ఈ ప్రయాణం అని ఆయన పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులు, లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల అండతో తెలంగాణను విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు అవిశ్రాంతంగా ఈ కృషిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీతో ఈ అనుబంధం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని సీఎం రేవంత్ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *