బీజేపీ అధ్యక్షుడి అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో

కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును నిరసిస్తూ బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నాయకులు రాస్తారోకో చేశారు. అదేవిధంగా -బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి పాల్పడిన ఘటనను బీజేపీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువ లకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి చర్యలకు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో  తగిన సమాధానం చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి బీజేపీని అణగదొక్కే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తోంది.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు పరిపాలనను గాలికి వదిలేసి బీజేపీని ఏ విధంగా అణగదొక్కాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, జిల్లాలోని సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి అణచివేత చర్యలు చేపట్టినా ప్రజాస్వామ్య పద్ధతిలో బలమైన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డా. జాటోత్ వెంకన్న నాయక్, నాలుగో డివిజన్ కార్పొరేటర్,  జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు భాగ్యలక్షి, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు నవీన్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు జుజ్జూరు మోహన్ కృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *