ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ

– వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ గోపి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:  రైతు నేస్తం కార్యక్రమం 105వ ఎపిసోడ్ మంగళవారం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ బి.గోపి పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సప్లై (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా అన్ని రకాల ఎరువులను రైతు లకు అందుబాటులో ఉంచుతున్నామని వ్యవసాయ సంచాలకులు తెలిపారు. ఈ యాప్ విధానంపై క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తర ణాధికారులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయని, మిగిలిన 10 జిల్లాల్లో కూడా రేపటి నుండి యాప్ ద్వారా సేవలు అందించేందుకు చర్యలు చేపడుతు న్నట్టు వివరించారు. యూరియా యాప్ ద్వారా ఇప్పటివరకు 33.97 లక్షల మంది రైతులు 141.93 లక్షల యూరియా బస్తాలను బుక్ చేసుకోగా, వారిలో 128.93 లక్షల బస్తాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఇప్పటివరకు 15.01 లక్షల క్యూఆర్ కోడ్లు జనరేట్ కాగా, 59.78 లక్షల బస్తాలు బుక్ అయ్యాయ‌ని, వాటిలో 41.68 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేసినట్టు వివరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏడు రకాల వరి సన్న రకాలు సాగుచేసిన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ వంగడాలు సాగుచేసిన రైతులు తమ విత్తన కొనుగోలు వివరాలను సంబంధిత డీలర్ల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. డీలర్ల వద్ద కొనుగోలు చేయకుండా సొంత విత్తనాలు వినియోగించిన రైతులు స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించి, వ్యవసాయ విస్తరణాధికారి వద్ద తమ సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఎఫ్ఎస్ యాప్ పై కమిషనరేట్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయానికి చెందిన ఎడీఏ (ఫర్టి లైజర్స్) మాధవి వివరణాత్మక ప్రసంగం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరాను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు. ఎరువుల బుకింగ్, పంపిణీ ప్రక్రియను ఆన్లైన్లో పర్యవేక్షించడం వల్ల కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యలకు అడ్డుకట్ట వేయ వచ్చని వివరించారు. ఈ యాప్ పనితీరుపై ప్రత్యేక వీడియో ప్రదర్శన కూడా రైతులకు అందించారు. ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితి, భూగర్భ జలమట్టాలు, సాగు నీటి ప్రాజెక్టుల అంశంపై భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి, భూగర్భ జల శాఖ సంయుక్త సంచాలకుడు, సాగునీటి శాఖ ఎస్ఈ రమేష్ తదితరులు రైతులకు కీలక సూచనలు అందించారు. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సాంప్రదాయ యూరియాతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన నానో యూరియా వినియోగంపై ఇఫ్కో క్షేత్రస్థాయి అధికారి బాలవికాస్ వివరించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన రైతు నాగరాజు తన సోయాబీన్ పంటలో నానో యూరియా వినియోగం ద్వా రా పొందిన అనుభవాలను రైతులతో పంచుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *