లారీ ఢీకొని యువకుడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: గ్యాస్ లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లి చౌరస్తా వద్ద శనివారం జరిగింది. నాగారంలోని శివానందపురి కాలనీకి చెందిన బెన్నూర్ అఖిల్ (20) హోండా యాక్టివాపై జిమ్ కి వెళ్తున్నాడు. రాంపల్లి క్రాస్ రోడ్స్ వద్ద అరటిపండ్లు కొనుగోలు చేసేందుకు ఫుట్ పాత్ పక్కన తన వాహనాన్ని నిలిపాడు. అదే సమయంలో నాగారం నుంచి బండ్లగూడ వైపు వేగంగా వెళ్తున్న గ్యాస్ లారీ అఖిల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అఖిల్ లారీ వెనుక చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *