– ఆగిన పనులను జెడ్ స్పీడ్‌తో పూర్తి చేస్తా
– సిద్దిపేటలో ఆర్టిఫిషియల్ బీచ్
– ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ వారిదని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా పదేళ్ళ పండుగ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లలో శనివారం నిర్వహించిన లేజర్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటలో ఆగిపోయిన పనులను జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తానన్నారు. ఒకప్పుడు బతకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మలను వేయడానికి నీళ్లు ఉండేవి కావని, ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని అన్నారు. అమెరికా, లండన్ లాంటి దేశాలలోని తన మిత్రులు ఈ పండుగకు అక్కడకి రావాలని వారు కోరగా తాను రాలేనని, తాను నియోజకవర్గ ప్రజల మధ్యనే జరుపుకుంటూ ఎంతో ఆనందం పొందుతానని చెప్పానన్నారు. సిద్దిపేటలో సముద్రం లేని లోటు తీర్చడానికి కోమటి చెరువు వద్ద ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అంతకుముందు హరీష్ రావు కోమటి చెరువు చుట్టూ తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజలు కూడా ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపారు. ఆయన వెంట నాయకులు కడవెరుగు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గ్యాదరి రవీందర్, మల్లికార్జున్, నాగరాజు తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





