– సుప్రియా సూలె కూతురు వివాహ రిసిప్షన్‌లో సరదా సన్నివేశం
న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నేతలు సరదాగా మాట్లాడుకున్న దృశ్యం ఓ వివాహ వేడుకలో కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణ నవ్వులు పూయించింది. దిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్‌లో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. రిసెప్షన్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ప్రియాంకను పలకరించిన మోదీ.. ప్రియాంకా జీ ఎలా ఉన్నారు? అని అడగగా.. బాగున్నాను… రెలా ఉన్నారు? అంటూ ఆమె బదులిచ్చారు. నేను అలాగే ఉన్నాను అని మోదీ నవ్వుతూ అన్నారు. వెంటనే అక్కడే ఉన్న ఖర్గే కల్పించుకుని.. ‘అలా ఏ లేదు మీరు కొంచెం మారిపోయారు‘ అంటూ సరదాగా చమత్కరించారు. దీంతో మోదీ నవ్వుతూ ఖర్గే భుజంపై తట్టారు. ఇద్దరూ సరదాగా చేతులు కలుపుతూ నవ్వుకున్నారు. సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం నాగ్‌పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సరంగ్ లఖానీతో జూన్‌లో ముంబైలో జరిగింది. దిల్లీలోని 6, జనపథ్‌లో సోమవారం రాత్రి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



