రాయదుర్గం భూ దోపిడీని అడ్డుకుంటాం

-గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: దాసోజు శ్రవణ్‌
‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్12: ‌రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీని అడ్డుకుని తీరుతామని  దీనిమీద గవర్నర్‌, ‌సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్‌ ‌నిర్మాణ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. రాయదుర్గంలో రూ.1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని రేవంత్‌ ‌రెడ్డి పీఎం ఏక్తా మాల్‌ ‌నిర్మాణం పేరుతో తన బినామీ సంస్థలకు ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టారని విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి ఎంత పెద్ద నేరస్థుడో ఆయనకి కొమ్ము కాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్థులని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్‌ ‌రూ.200 కోట్లు లోన్‌ ఇచ్చింది. రేవంత్‌ ‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ వాళ్లకు కళ్లే కనబడటం లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌ ‌రెడ్డి బినా కంపెనీని నడుపుతున్నది ఐఏఎస్‌ ‌జయేష్‌ ‌రంజన్‌, ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ‌విష్ణువర్ధన్‌ ‌రెడ్డి అని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు దొంగ అగ్రిమెంట్లు, టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు పందికొక్కుల లాగా దోచుకుని తింటాము అంటే కర్రు కాల్చి అధికారులకు కూడా వాతలు పెడతామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *