రక్షకులే రాక్షసులుగా మారుతున్నారు

– మహిళలపై దాడులపై రాహుల్ తీవ్ర ఆగ్రహం
– ప్రశ్నించే మహిళలకు అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు?

న్యూదిల్లీ, అక్టోబర్ 5: రక్షకులే రాక్షసుల్లా మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రశ్నించే మహి ళలను చూసి కేంద్ర హోంమంత్రి అమిత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మహిళలను అణచివేసే ధోరణి ఢిల్లీలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల మహిళలపై దాడులు, దురుసు ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల జర్నలిస్టులు షహీన్ ఖాన్, నఫీసా ఖాన్లతో జరిపిన సంభాషణకు సంబంధిం చిన వీడియోను ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచు కున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించా రని జర్నలిస్టులు తనతో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారని రాహుల్ తెలిపారు. కెమెరాలు లాక్కొవడంతోపాటు వారిని ఈడ్చుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. వారి ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్‌ నమోదు చేయలేదని పేర్కొన్నారు.

మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే..

పోలీసే స్టేషన్లోనే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే వారికి ప్రమాదంగా మారుతున్నారని ఆరోపిం చారు. సాకేత్ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *