చర్చకు నెప్పుడూ సిద్దమే

– చర్చ లేకుండా చేస్తున్నదే విపక్షం
-హోం మంత్రి అమిత్‌ ‌షా

న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ‌పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా స్పందించారు. ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. అయితే సభలో చర్చ జరగాలా.. ఆందోళన కొనసాగాలా అనేది ప్రతిపక్షమే నిర్ణయించుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలనుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు.. 24 గంటల పాటు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగడానికి అందుబాటులో ఉంటానని చెప్పారు. చర్చ జరపాలని ప్రతిపక్షాలు అధికారికంగా లేఖ రాస్తే.. చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. బుధవారం పార్లమెంట్‌ ‌హౌస్‌ ‌కాంప్లెక్స్‌లో అమిత్‌ ‌షా డియాతో మాట్లాడుతూ.. ’సమావేశాలు మొదలైన నాటినుంచి పార్లమెంట్‌కు వస్తున్నాను. నా ఛాంబర్‌లో కూర్చుంటున్నాను. పార్లమెంట్‌ ‌కార్యక్రమాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటుంటే.. ఎవరైనా ఏం చేస్తారు?. వాళ్లు చర్చ జరగడానికి అంగీకరించరు. దీన్ని బట్టి ఎవరు పారిపోతున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాకు లేఖ రాయాలని సూచించారు. అలా చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు చర్చ ప్రారంభించవచ్చని.. రాత్రి వరకు చర్చ కొనసాగించేందుకు తాను సిద్ధమన్నారు. అవసరమైతే గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా చర్చను కొనసాగిద్దామని తెలిపారు. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇస్తానని షా చెప్పారు. పార్లమెంటులో ‘కనిపించడం  లేదు‘, ‘పారిపోయారు‘ వంటి పదాలు ఉపయోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జి ఘటనపై చర్చకు రావాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీని ఉద్దేశించి సవాల్‌ ‌చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ కౌంటర్‌ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ’విద్యార్థులపై లాఠీచార్జ్ ఎవరు చేశారు. కాల్పులకు ఆదేశించింది ఎవరు?  20 రోజులుగా అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు. పార్లమెంట్‌ ‌ముగిసే సమయానికి అమిత్‌షా డ్రామాలు ఆడుతున్నారు’ అంటూ రాహుల్‌ ‌మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *