ప్రపంచస్థాయి విద్య.. అదే మా లక్ష్యం

– ‘ఎక్స్‌”లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : భవనాలు నిర్మించడం సులభమే.. కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి.. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆరఎస్) వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి అని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపేస్తూ ప్రతి చిన్నారికి ప్రపంచస్థాయి విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న ఈ విద్యాలయాలు పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయి. పేద పిల్లల కలలకు చిరునామాగా, తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయి అని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *