తెలంగాణలో బీఆర్ఎస్‌ షాడో కేబినెట్‌ పాత్ర..!!

“కొన్ని దేశాల్లో ప్రభుత్వ కేబినెట్ లకు పోటీగా షాడో కేబినెట్ చేస్తోంది..యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల్లో షాడో కేబినెట్లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. షాడో కేబినెట్ కు చట్టబద్ధత ఉండదు.రాజ్యాంగ పరమైన అధికారాలుండవు..కానీ ప్రభుత్వం, మంత్రులు, పాలనా విధానాలపై షాడో కేబినెట్ నిఘా పెట్టుతుంది. ఒక్కొక్క షాడో మంత్రి ఒక్కొక్క శాఖపై నిఘా పెట్టుతారు. ఆయా శాఖల్లో జరిగే అవకతవకలు, అవినీతిపై డేగా కన్నుతో గమనిస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పని చేస్తుంది..మన దేశంలో ప్రతిపక్షం ఆధ్వర్యంలో అలాంటి షాడో కేబినెట్ లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు బలహీన పర్చుతున్నాయి. పార్టీలు బలహీనంగా, ప్రజలకు జవాబుదారిగా, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే దేశంలో యూకే తరహా షాడో కేబినెట్ ఉండాలి.”

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న, ప్రభుత్వం బలహీనంగా ఉంది..అదే టైంలో బలమైన  ప్రతిపక్షంగా బీఆర్ఎస్‌ ఉంది. సర్కార్ పూర్తి స్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేసుకోలేదు. కానీ ప్రతిపక్షం మాత్రం కేసీఆర్‌ నాయకత్వంలో  బలమైన షాడో కేబినెట్‌ పాత్రను పోషిస్తూ ప్రభుత్వ జవాబుదారీని  పెంచేలా రెండున్నరేళ్లుగా ఈ షాడో కేబినెట్‌ సక్సెస్ పుల్ గా పని చేస్తోంది. శాఖల వారిగా, ప్రాంతాల వారిగా బీఆర్ఎస్‌ ఒక్కొ షాడో మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచుతూ ఇచ్చిన హామీల అమలుపై పోరాటం చేస్తున్నారు.
 
షాడో కేబినెట్‌ నిత్యం ప్రభుత్వం, మంత్రులు, పాలసీలపై ఫోకస్‌ పెట్టింది. సర్కార్ వైఫల్యాలను విమర్షిస్తూ  మరోవైపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి, బయటకు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్న కేసీఆర్ మాత్రం తన షాడో కేబినెట్‌ టీంతో తన పని తాను చేసుకుంటుపోతున్నారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్‌ షాడో కేబినెట్‌  ప్రభుత్వంపై చేస్తుంది..హరీష్‌ రావు, కేటీఆర్‌, జగదీష్‌ రెడ్డి, ఆర్ఎస్‌ ప్రవీన్‌ కుమార్‌ సహా అధికార కేబినెట్‌కు సమాంతరంగా మాజీ మంత్రులు , యూత్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లులతో  షాడో కేబినెట్‌ పని చేస్తుంది..నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య , వైద్యం, ఐటీ, హోం శాఖల్లోనే కాదు, ఆర్ధిక, విద్యుత్‌, సంక్షేమం, వ్యవసాయ రంగాల్లో పట్టున్న షాడో కేబినెట్‌ ప్రతిపక్షంలో ఉంది..ఆయా రంగంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పాలసీలు, తెలంగాణకు అన్యాయం జరిగే అంశాలపై షాడో కేబినెట్‌ అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.
 
రాష్ట్రంలో బలమైన షాడో కేబినెట్‌ ఉండటం వల్ల ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రతిపక్షం పసిగట్టుతుంది. అధికార పార్టీ కుట్రలను బహిర్గతంచేస్తూ  ప్రజలను చైతన్యం చేస్తోంది. హిల్ట్‌ పాలసీ,మూసీ సుందరీకరణ, అప్పులు ఆస్తులు ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవానికి జరుగుతున్న కుట్రలను బీఆర్ఎస్‌ షాడో కేబినెట్‌ ముందే పసిగట్టుతుంది. అందుకే ప్రభుత్వంలో జరిగే చిన్న అలజడి కూడా బీఆర్ఎస్‌ పార్టికి తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వ పెద్దలకే తెలియని అనేక విషయాలు ప్రతిపక్షానికి ఎలా తెలుస్తున్నాయని తలలు పట్టుకుంటున్నారంటే అది షాడో కేబినెట్‌ పనితీరు.
 
షాడో కేబినెట్ ప్రజలను చైతన్యం చేస్తుంది.హిల్ట్‌ , మూసీ ప్రాజెక్ట్‌ పాలసీలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు, ఏపీ నీళ్ల దోపిడీ, దిల్లీకి నిధుల దోపిడీని షాడో కేబినెట్‌ బాహిరంగపరుస్తూ  ప్రభుత్వ కుట్రలు భగ్నం చేస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్ట్‌, ,దేవాదుల మోటర్లు అన్‌ చేశారంటే అది బీఆర్ఎస్‌ ఒత్తిడితోనే సాధ్యమైంది. తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఏపీ చేస్తున్న కుట్రలు హరీష్‌ రావు ఆధారాలతో బయటపెట్టారు అంటే అది షాడో కేబినెట్‌ పనితీరుకు నిదర్శనం.
 
తెలంగాణ సోయిలేని ప్రభుత్వాన్ని నిద్ర లేపుతూ, తెలంగాణ ఆత్మలేని రేవంత్‌ రెడ్డి కుట్రలను షాడో కేబినెట్‌ తిప్పికొట్టుతోంది.  భారత్ లో యూకేలాగా షాడో కేబినెట్ లేదు. కానీ ప్రభుత్వ ఖర్చులు, ఆదాయాలను పరిశీలించే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఎసీ) వ్యవస్థ ఉంది. ఇది రాజ్యాంగ బద్దమైన వ్యవస్థే అయినా కోరలు లేని పాములాంటింది. ఈ వ్యవస్థను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తోన్నాయి..ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ పదవులు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికి ఇవ్వడం వల్ల ప్రభుత్వంలో జరిగే అవకతవకాలపై పీఏసీ సమీక్షించే అవకాశం లేకుండా పోయింది.దీంతో ప్రభుత్వం అకౌంటబులిటీ లేకుండా పోయింది.
 
తెలంగాణలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వకుండా పార్టీ ఫిరాయించిన నేతకు  ఇచ్చింది..ప్రభుత్వంలో జరిగే అవినీతి అవకతవకలు ప్రజలకు తెలియకుండా సర్కార్  కుట్రలలో భాగంగా చేసింది..కానీ  బీఆర్ఎస్‌పై  ఎన్ని కుట్రలు చేసిన ఆ పార్టీ షాడో కేబినెట్‌ల వ్యవహరిస్తూ ప్రభుత్వంపై నిత్యం నిఘా పెట్టుతుంది. సర్కార్ తప్పులను బయటపెట్టుతుంది.
 
తెలంగాణలో తప్ప దేశంలో మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి..అధికార పార్టీ బలంగా ఉంది..దానికి కారణం ఆయా రాష్ట్రాల్లో బలమైన షాడో కేబినెట్‌ లేకపోవడం ఒక కారణమైతే, పార్టీలను చీల్చే అధికార పార్టీ కుట్రలు ఛేదించే వ్యవస్థ లేకపోవడం. తెలంగాణలో  రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్‌ ను  చీల్చే కుట్రలు చేశారు.కానీ కేసీఆర్ వ్యూహం ముందు నిలవలేకపోయారు.
 
అంతేకాదు కేంద్రంలో, రాష్ట్రాల్లో షాడో కేబినెట్లు లేకపోవడం వల్లే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలకు తిరుగు లేకుండాపోయింది‌.దీంతో ఎన్డీయే  తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలో ప్రతిపక్షాలు షాడో కేబినెట్‌ ఉంటే ఇవాళా బీజేపీ బాహుబలిలా కనిపించేది కాదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం వచ్చేది కాదు.
 
బీఆర్ఎస్సే కాదు, బీఆర్ఎస్‌ సోషల్‌ మీడియా కూడా ప్రధాన స్రవంతి మీడియాకు షాడో వ్యవస్థగా పని చేస్తుంది. రాష్ట్రంలో, దేశంలో మేన్‌ స్ట్రీమ్‌ మీడియాను కంట్రోల్ ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తుంటే సోషల్ మీడియా మాత్రమే ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. అధికార పార్టీ అసత్యాలను ఆధారాలతో బహిర్గతం చేస్తూ . ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే సోషల్ మీడియా వాయిస్‌ లెస్ పీపుల్‌ వాయిస్ అవుతుంది.ఇప్పుడు దేశానికి తెలంగాణ తరహా షాడో కేబినెట్‌ అవసరం, ఆవశ్యకత ఉంది.
 
 
ప్రజాస్వామ్య వ్యవస్థకు లెజిస్లేచర్, మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ ,ప్రెస్ అండ్ మీడియా ఎలాగైతే నాలుగు పునాదులో ప్రధాన ప్రతిపక్షం కూడా అత్యంత కీలకమైన పిల్లర్. శాసన, అధికార వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రతిపక్షం పని మొదలైతుంది. అధికార పార్టీ  ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకుప్పుడు మీడియా మాట్లాడుతుంది. న్యాయ వ్యవస్థ పని మొదలైతుంది. ఇవాళ మీడియా సర్కార్ బానిసగా మారింది, న్యాయ వ్యవస్థ అచేతన స్థితిలో ఉంది. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానిది కీలక పాత్ర.
 
.ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత వికసిస్తుంది. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం నియంతృత్వం వైపుగా పయనిస్తుంది. దేశంలో ఇప్పుడు స్ట్రాంగ్ అపొజిషన్ లేకపోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచుల్లో ఉందని మాట్లాడున్నాం.
 
కేంద్రంలో అధికార పార్టీ వ్యవస్థసలను నిర్వీర్యం చేస్తోంది..రాజ్యాంగ సంస్థలపై గుత్తాధిపత్యంతో బలహీనపర్చుతోంది. అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు నియంతృత్వం విధానాలు అమలు చేస్తోంది..మీడియాలను నియంత్రిస్తు తప్పుడు ప్రాపగాండా చేస్తోంది. చట్టసభలను బుల్డోజ్ చేస్తు నిర్భంధ ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను గుప్పిట్లో బంధించింది.న్యాయ వ్యవస్థను పంజరంలో చిలుకలా ప్రభావితం చేస్తోంది. బలహీన ప్రతిపక్షాన్ని మరింత బలహీన పర్చుతోంది.
 
 
వ్యవస్థలన్నీ అధికారానికి బానిసలుగా మారి గులాంగిరీ చేస్తున్నాయి..న్యాయ వ్యవస్థ అప్పుడప్పుడు ప్రజాస్వామ్యం రాజ్యాంగం హక్కుల గురించి మాట్లాడినా అది వరి గడ్డ మంటే..చింత మొద్దులా నిత్యం మండటం లేదు..ఇక ప్రతిపక్షం పేపరు పులిగా తయారైంది. అనకొండలాంటి అధికార పక్షం ముందు వానపాముల మారిపోయింది. దీంతో ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతుంది..విజిల్ బ్లోయర్స్ గా ఉండాల్సిన సంస్థలు విజుబులిటి లేకుండా పోయాయి.
 
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం షాడో కేబినెట్ లా పని చేయాలి..ప్రభుత్వాన్ని కనిపెడుతు, మంత్రులపై నిఘా పెట్టుతూ, పాలనా విధానాలను గమనిస్తు ఉండాలి..కానీ దేశంలో అలాంటి పరిస్థితి లేదు. సంకీర్ణ ప్రభుత్వ కేబినెట్ కు సమాంతరంగా సంకీర్ణ ప్రతిపక్ష షాడో కేబినెట్ లేదు..ఇది బలహీన ప్రతిపక్షాన్ని సూచిస్తుంది. ప్రజాస్వామ్యం బలహీనతను ఎత్తి చూపిస్తోంది.
 
పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లులు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు ఇలా ఏ అంశంపై మాట్లాడాలన్నా ప్రతిపక్ష నేతలుగా లోక్ సభ లో రాహుల్, ప్రియాంక గాంధీలు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గేలే మాట్లాడే అవకాశం వస్తుంది..ప్రతిపక్షంలో మిత్ర పార్టీలన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలపై బీజేపీ అధికార గుత్తాధిపత్యం సాధిస్తే. కాంగ్రెస్ మాత్రం మిత్ర పక్షంపై గుత్తాధిపత్యం సాధిస్తోంది.
 
కొన్ని దేశాల్లో ప్రభుత్వ కేబినెట్ లకు పోటీగా షాడో కేబినెట్  చేస్తోంది..యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల్లో  షాడో కేబినెట్లు సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. షాడో కేబినెట్ కు చట్టబద్ధత ఉండదు.రాజ్యాంగ పరమైన అధికారాలుండవు..కానీ ప్రభుత్వం, మంత్రులు, పాలనా విధానాలపై షాడో కేబినెట్ నిఘా పెట్టుతుంది. ఒక్కొక్క షాడో మంత్రి ఒక్కొక్క శాఖపై నిఘా పెట్టుతారు. ఆయా శాఖల్లో జరిగే అవకతవకలు, అవినీతిపై డేగా కన్నుతో గమనిస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పని చేస్తుంది..మన దేశంలో  ప్రతిపక్షం ఆధ్వర్యంలో అలాంటి షాడో కేబినెట్ లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు బలహీన పర్చుతున్నాయి. పార్టీలు బలహీనంగా, ప్రజలకు జవాబుదారిగా, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే దేశంలో యూకే తరహా షాడో కేబినెట్ ఉండాలి.
 
తోటకూర రవేష్‌
  98661 68676

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *