– ఎర్రవల్లి, శివారు వెంకటాపురం భూములపై సీఎం సమీక్ష
– సర్వే నెం.325పై కేసీఆర్‌కు జారీ కానున్న నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమికి గాను రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా మిగిలిన 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో అధికారులు సర్వే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు భూమి సరిహద్దులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు అందజేయాలని అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సకల సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ డిపార్టుమెంటుకు అప్పగించాలని సూచించారు. జూన్ 2లోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




