ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనపై రేపు భారీ ర్యాలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : హెచ్ఐవి, ఎయిడ్స్, సిఫిలిస్ మొదలైన వ్యాధుల పట్ల అవగాహన పెంచి వాటి నియంత్రణకు, వాటి బారిన పడిన వారికి తగు చికిత్స అందించేందుకు ఈనెల 12 నుండి రెండు నెలలపాటు విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. బుధవారం(12వ తేదీ) ఐమాక్స్ పక్కన గల హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుండి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు దాదాపు 1500మందితో ఉదయం 7 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు, ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ‌నర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు పాల్గొంటారని వివరించారు. ర్యాలీలో నగరంలోని పలు కాలేజీల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ఇతర పౌరులు పాల్గొంటారన్నారు. మంత్రులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడంతోపాటు వారు కూడా ర్యాలీలో పాల్గొని సందేశం ఇస్తారని చెప్పారు. ఎవరూ ఎయిడ్స్ బారినపడకుండా, సంక్రమించిన వారి నుండి ఇతరులకు ముఖ్యంగా పుట్టబోయే చిన్న పిల్లలకు సంక్రమించకుండా ఉండేం దుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరం రెండు నెలలపాటు విస్తృతంగా నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అయన కోరారు. బి-పాజిటివ్ టు స్టాప్ హెచ్ఐవి పాజిటివ్ అనే నినాదంతో ముందుకెళ్దాం.. తెలంగాణను హెచఐవి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం.. రండి.. మీరు కూడా ర్యాలీలో పాల్గొని ప్రచార కార్యకర్తగా మారండి అని ఎయిడ్స్ నియంత్రణ మండలి పిలుపునిచ్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *