త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
– జహీరాబాద్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన

సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 15: తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానవిÖ కోసం తాము పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహలు శుక్రవారం పర్యటించారు. ఈ సంద‌ర్భంగా రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి భూమి పూజ చేశారు. 1500 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేజేఎస్ యూనిట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తొగర్‌పల్లిలో ఇంత పెద్ద పరిశ్రమ రావడానికి నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారణమని చెప్పారు. ఈ పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితమని, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్‌లో ఓ ఇండస్ట్రీ నెలకొల్పుతామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి జాతీయ ఉత్పత్తిలో 10 శాతం ఉత్పత్తి పెంచేలా తాము పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొదట పరిశ్రమలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఏర్పడ్డాయని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబుకు పరిశ్రమల శాఖ తగినదేనని అన్నారు. మెదక్ ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం సహకరించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాకు కేంద్ర సంస్థలను తీసుకొచ్చామని జగ్గారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *