జవహర్ నగర్ దోపిడీ కేసులో పురోగతి

– ప్రధాన నిందితులను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: జవహర్‌నగర్‌లో నేపాలీ ముఠా జరిపిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మమత అలియాస్ విÖనా కడాయత్, ఆమె భర్త రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ దంపతులను పట్టుకున్నారు. మరో నలుగురి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన రోజు యజమాని ద్విచక్ర వాహనాన్ని తీసుకుని దుండగులు పరారయ్యారు. ఆ బైక్‌ను యాప్రాల్‌లోని పెట్రోల్ బంకు వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏజెంట్ భీమ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితులను రేపటిలోగా హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో మిగిలిన నిందితులు నేపాల్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ దంపతులను బంధించి నేపాలీ ముఠా దోపీడీకి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో దుండగులు పరారయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *